AP: రాష్ట్రంలో పదిరోజులుగా కరోనా కేసుల్లో తగ్గుదల

ఆంధ్రప్రదేశ్ లో గత కొద్దిరోజులుగా కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. గత పదిరోజులుగా  నమోదవుతున కేసుల సంఖ్య చూస్తే..వైరస్ తీవ్రత తగ్గినట్టు తెలుస్తోంది. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు మాత్రం పెరుగుతున్నాయి.

Last Updated : Sep 30, 2020, 07:17 PM IST
AP: రాష్ట్రంలో పదిరోజులుగా కరోనా కేసుల్లో తగ్గుదల

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో గత కొద్దిరోజులుగా కరోనా వైరస్ ( Coronavirus ) తగ్గుముఖం పట్టింది. గత పదిరోజులుగా  నమోదవుతున కేసుల సంఖ్య చూస్తే..వైరస్ తీవ్రత తగ్గినట్టు తెలుస్తోంది. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు మాత్రం పెరుగుతున్నాయి.

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు ( Corona cases in ap ) తగ్గుముఖం పడుతున్నాయి..గడిచిన 24 గంటల్లో 71 వేల 806 శాంపిల్స్  పరీక్షించగా 6 వేల 133 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6 లక్షల 93 వేల 484 కు చేరింది. కోవిడ్‌ బాధితుల్లో కొత్తగా 48 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5 వేల 828 కు చేరింది. ఒక్క రోజులోనే 7 వేల 75 మంది కోవిడ్‌ వైరస్  నుంచి కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైరస్‌ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 6 లక్షల 29 వేల 211 గా ఉంది.  ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 58 వేల 445కు తగ్గాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

తాజా పరీక్షల్లో 35 వేల 254 ట్రూనాట్‌ పద్ధతిలో, 36 వేల 552 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ పద్ధతిలో చేశామని వెల్లడించింది. మొత్తం ఇప్పటివరకు 58 లక్షల 6 వేల 558 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని తెలిపింది. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 11.94 శాతంగా ఉందని, ప్రతి 10 లక్షల జనాభాకు 1 లక్షా 8 వేల 737 మందికి కరోనా టెస్టులు ( Covid Tests ) చేస్తున్నామని వెల్లడించింది.

గత 24 గంటల్లో నమోదైన కేసుల విషయానికి వస్తే..  అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 983 కేసులు నమోదు కాగా, చిత్తూరులో 925, అనంతపురంలో 580, గుంటూరులో 498 నమోదు అయ్యాయి. Also read: CPI Narayana: మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కు వ్యక్తిత్వమే లేదు

 

Trending News