AP Curfew: ఏపీలో తగ్గుతున్న కరోనా ఉధృతి , మరో రెండు వారాలు కర్ఫ్యూ పొడిగించే అవకాశం

AP Curfew: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉధృతి కాస్త అదుపులో వచ్చింది. లాక్‌డౌన్ ఫలితంగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా నియంత్రణను కొనసాగించేందుకు లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలపాటు కొనసాగించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 29, 2021, 02:58 PM IST
AP Curfew: ఏపీలో తగ్గుతున్న కరోనా ఉధృతి , మరో రెండు వారాలు కర్ఫ్యూ పొడిగించే అవకాశం

AP Curfew: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉధృతి కాస్త అదుపులో వచ్చింది. లాక్‌డౌన్ ఫలితంగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా నియంత్రణను కొనసాగించేందుకు లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలపాటు కొనసాగించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

కరోనా మహమ్మారి (Corona Pandemic) కట్టడికై దేశంలో వివిధ రాష్ట్రాలు లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. ఏపీలో కరోనా నియంత్రణకై కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. రోజుకు 18 గంటల కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో మే 5వ తేదీ నుంచి కర్ఫ్యూ అమల్లో ఉంది. ఈ నెల 31వ తేదీ వరకూ కర్ఫ్యూ కొనసాగనుంది. ఈ నేపధ్యంలో కరోనా కేసుల సంఖ్యలో కాస్త తగ్గుదల కన్పించింది. డిశ్చార్జ్ రేటు కూడా పెరిగింది. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుతుండటంతో కర్ఫ్యూ తొలగిస్తే..కరోనా వైరస్ మరోసారి విజృంభించే అవకాశాలున్నాయి. 

అందుకే రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు వైఎస్ జగన్(Ap cm ys jagan). సమీక్షలో కర్ఫ్యూ పొడిగింపుకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో చిత్తూరు, ఉభయ గోదావరి జిల్లాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా సంక్రమణ ఛైన్ కొనసాగకుండా ఉండేందుకు మరో రెండు వారాల పాటు కర్ఫ్యూ(Curfew) విధించే అవకాశాలున్నాయి.

Also read: Anandayya ayurvedam mandu: కృష్ణపట్నం ఆయుర్వేదం మందు పంపిణీపై ఆనందయ్య క్లారిటీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News