Cock versus Corona: కోడి వర్సెస్ కోవిడ్ వైరస్..ఈసారికి తగ్గినట్టేనా

Cock versus Corona: సంక్రాంతి వచ్చిందంటే చాలు పోలీసులకు ఓ సవాలే. కోడి పందేలపై ఆంక్షలు మొదలవుతుంటాయి. అనుమతిస్తే ఓ చిక్కు..లేదంటే మరో చిక్కు. ఇప్పుడా సమస్యను కోవిడి తీర్చేసింది.

Last Updated : Jan 13, 2021, 09:11 PM IST
Cock versus Corona: కోడి వర్సెస్ కోవిడ్ వైరస్..ఈసారికి తగ్గినట్టేనా

Cock versus Corona: సంక్రాంతి వచ్చిందంటే చాలు పోలీసులకు ఓ సవాలే. కోడి పందేలపై ఆంక్షలు మొదలవుతుంటాయి. అనుమతిస్తే ఓ చిక్కు..లేదంటే మరో చిక్కు. ఇప్పుడా సమస్యను కోవిడి తీర్చేసింది.

కాగల కార్యాన్ని గంధర్వులు తీరుస్తారనేది అనాదిగా వస్తున్న మాట. ప్రతియేటా సంక్రాంతి ( Sankranti ) కి పోలీసులు, ప్రభుత్వానికి ఎదురయ్యే పెద్ద తలనొప్పిని ఈసారి కోవిడ్ తీర్చినట్టు కన్పిస్తోంది. ఏటా సంక్రాంతికి ఎదురయ్యే ప్రధాన సమస్య  కోడి పందేలు ( Kodi pandelu ) ( Cock fights ) . కోస్తాంధ్రలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్దఎత్తున జరిగి తీరే సాంప్రదాయ బెట్టింగ్ క్రీడ కోడి పందేలు. పెద్ద పెద్ద బరులు ఏర్పాటు చేసి కోట్ల రూపాయల్లో టర్నోవర్ బెట్టింగ్ జరుగుతుంటుంది. 

అనుమతిస్తే ఓ తంటా.. లేదంటే మరో సమస్య. అటు ప్రభుత్వం ఇటు పోలీసులు ఇద్దరికీ కోడి కత్తి  మీద సవాలే. ఈసారి ఆ సమస్యను కోవిడ్ తీర్చినట్టుంది. కోడి పందేల ( Cock fights ) పై కోవిడ్ వైరస్ ( Covid19 virus ) సంక్రమణ భయం వెన్నాడుతోంది. అందుకే పెద్దగా బరులు లేవు. ఉన్నా పెద్ద ఆసక్తి కన్పించడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా పోలీసులపై అనుమతుల కోసం పెద్దగా ఒత్తిళ్లు లేవు. కోడిపందేలపై ఆదారపడి ప్రత్యేక్షంగా పరోక్షంగా వందలాది కుటుంబాల జీవనోపాది ఉంటోంది. కోడి కత్తులు తయారు చేసేవారు, కోడి పుంజులకు కత్తులు కట్టేవారు, బరులు  ఏర్పాటు చేసే కూలీలు, స్టాల్స్ పెట్టుకునే చిన్న చితకా వ్యాపారులు ఇలా చాలారకాలుగా జీవనోపాధి కలుగుతుంది సంక్రాంతి మూడ్రోజులు.  ఇప్పుడు పెద్దగా కన్పించడం లేదు. పందెం రాయుళ్లు కూడా తగ్గిపోయినట్టు కన్పిస్తోంది. 

Also read: Bhogi mantalu..Kodi pandelu: తెలుగు లోగిళ్లలో వెలిగిన భోగి మంటలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News