ఏపీలో కొత్తగా 75 పాజిటివ్ కేసులు

ఎన్ని చర్యలు తీసుకున్నా .. తెలుగు రాష్ట్రాల్లో 'కరోనా వైరస్' ఉద్ధృతి ఆగడం లేదు. కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో జనం  ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకీడుస్తున్నారు. 

Last Updated : Apr 20, 2020, 02:17 PM IST
ఏపీలో  కొత్తగా 75 పాజిటివ్ కేసులు

ఎన్ని చర్యలు తీసుకున్నా .. తెలుగు రాష్ట్రాల్లో 'కరోనా వైరస్' ఉద్ధృతి ఆగడం లేదు. కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో జనం  ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకీడుస్తున్నారు. 

తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ పాజిటివ్ కేసులకు సంబంధించి బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కొత్తగా 75 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తాజా కేసులతో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు కేసుల సంఖ్య  722కు చేరుకుంది. 

ఇందులో 610  కేసులు యాక్టివ్ గా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు కరోనా వైరస్ కు చికిత్స అందించి 92 మందిని సురక్షితంగా ఇళ్లకు పంపించినట్లు తెలిపింది. గత 24  గంటల్లోనే 27 మందిని ఇంటికి పంపించినట్లు వివరించింది. గుంటూరు జిల్లాకు చెందిన 25  మందిని, కృష్ణా జిల్లాకు చెందిన 10 మందిని, విశాఖకు చెందిన ఇద్దరిని డిశ్చార్జి చేసినట్లు వెల్లడించింది. 

గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారికి ముగ్గురు బలయ్యారు. ఇప్పటి వరకు మొత్తం మృతుల సంఖ్య 20కి చేరుకుంది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News