అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 53,681 కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు ( Corona tests ) చేయగా.. అందులో 7,813 మందికి కరోనా సోకినట్టు ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా గత 24 గంటల్లో 52 మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య మొత్తం 985 కు చేరింది. తాజాగా కరోనావైరస్ సోకిన వారితో కలిపి ఏపీలో కరోనావైరస్ సోకిన వారి సంఖ్య మొత్తం 88,671 కు చేరింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు జరిపిన పరీక్షల్లో 27,955 ట్రూనాట్ పద్ధతిలో చేయగా.. మరో 25,726 పరీక్షలు ర్యాపిడ్ టెస్టింగ్ పద్ధతిలో చేశారు. ఈ పరీక్షలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 15,95,674 కరోనా పరీక్షలు ( COVID-19 tests ) చేశామని ఏపీ సర్కార్ తెలిపింది. Also read: Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు
ఇవాళ 3,208 మంది కరోనావైరస్ కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 43,255 కి చేరింది. కరోనా సోకిన మొత్తం మందిలో కోలుకున్న వారి సంఖ్య దాదాపు 50 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన లేటెస్ట్ హెల్త్ బులెటిన్ ( AP Health bulletin ) ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 44,431 యాక్టివ్ కేసులు ఉన్నాయి. Also read: Jackfruit benefits: పనస పండుతో ప్రయోజనాలు.. మాంసాహారానికి మంచి ప్రత్యామ్నాయం