AP: పంచాయితీ ఎన్నికలపై మళ్లీ రాజుకున్న వివాదం, ఎస్ఈసీ నిర్ణయంపై విమర్శలు

ఏపీలో పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ జారీ వివాదాస్పదమవుతోంది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యక్తిగత ఎజెండాతో ఎన్నికల షెడ్యూల్  విడుదల చేశారని  ఆరోపణలు వస్తున్నాయి.

Last Updated : Jan 9, 2021, 12:58 PM IST
AP: పంచాయితీ ఎన్నికలపై మళ్లీ రాజుకున్న వివాదం, ఎస్ఈసీ నిర్ణయంపై విమర్శలు

ఏపీలో పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ జారీ వివాదాస్పదమవుతోంది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యక్తిగత ఎజెండాతో ఎన్నికల షెడ్యూల్  విడుదల చేశారని  ఆరోపణలు వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ( Ap local body elections ) వివాదం మరోసారి తెరపైకొచ్చింది. నాలుగు దశల్లో పంచాయితీ ఎన్నికల్ని నిర్వహించారని నిర్ణయిస్తూ ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Ap sec nimmagadda ramesh kumar ) విడుదల చేసిన షెడ్యూల్ పై విమర్శలు అధికమవుతున్నాయి. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రాజకీయ దురుద్దేశంతోే వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారంటూ నిమ్మగడ్డపై మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్, శ్రీరంగనాథరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్మగడ్డ నిర్ణయం వెనుక కచ్చితంగా కుట్రకోణం దాగుందని దుయ్యబట్టారు. 

కరోనా సెకండ్ వేవ్ ( Corona second wave ) ఉందని కేంద్రం హెచ్చరించినా నిమ్మగడ్డ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని  మంత్రి కన్నబాబు ( Minister kannababu ) విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేకపోయారని ప్రశ్నించారు. నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని మంత్రి శీరంగనాథరాజు మండిపడ్డారు. వ్యాక్సినేషన్ ( Corona vaccination ) ఇచ్చే సమయంలో ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం వెనుక కుట్ర దాగుందని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. 

నిమ్మగడ్డ మొదట్నించీ వివాదాస్పదంగానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా విన్పిస్తున్నాయి. కరోనా వైరస్ కేసులు తక్కువగా ఉన్నప్పుడు ఎన్నికల్ని వాయిదా వేసిన ఎన్నికల కమీషనర్..ఇప్పుడు సెకండ్ వేవ్ సమయంలో..వ్యాక్సినేషన్ టైమ్ లో ఎన్నికలకు వెళ్లడం హాస్యాస్పదమనే మాట విన్పిస్తోంది. నిమ్మగడ్డ..చంద్రబాబు ( Chandrababu )కు తొత్తుగా వ్యవహరిస్తున్నారని..వైసీపీ ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. 

Also read: AP Local body elections 2021 Schedule: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News