పులివెందుల ప్రజలను మోసం చేశారంటూ జగన్‌పై కంప్లైంట్

Last Updated : Nov 10, 2017, 03:44 PM IST
పులివెందుల ప్రజలను మోసం చేశారంటూ జగన్‌పై కంప్లైంట్

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి పులివెందుల ప్రజలను జగన్ మోసం చేశారని ఆయనపై పులివెందుల పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేత రామగోపాల్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రజల ఓట్లతో గెలుపొందిన జగన్... నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశాన్ని వదులుకొని పాదయాత్రలు చేయడం ఏంటనీ ప్రశ్నించారు. పులివెందుల నియోజకవర్గానికి ప్రాతినిత్యం వహిస్తున్న జగన్ పై ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో రామగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. 

Trending News