/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

KCR NEW PARTY: రాష్ట్రపతి ఎన్నికల వేళ దేశ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలను ఏకగ్రీవం చేసేలా బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అటు టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే పనిలో పడింది. జూన్ 15న ఢిల్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది. అదే సమయంలో జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన దేశంలో సంచలనమైంది. జాతీయ పార్టీ ప్రకటన చేసిన కేసీఆర్ తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చర్చలు జరపడం మరింత ఆసక్తిగా మారింది. పీకే డైరెక్షన్ లోనే కేసీఆర్ జాతీయ అడుగులు వేస్తున్నారనే చర్చ సాగుతోంది.

ప్రశాంత్ కిషోర్ తో చర్చలు జరుపుతూనే ఏపీకి చెందిన ఉండవల్లి అరుణ్ కుమార్ తో సమావేశమయ్యారు కేసీఆర్. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ను తీవ్రస్థాయిలో టార్గెట్ చేసిన వ్యక్తుల్లో ఉండవల్లి ఒకరు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా కేసీఆర్ పై విమర్శలు చేశారు ఉండవల్లి. కేసీఆర్ కూడా బహిరంగ సభల్లోనే ఉండవల్లిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అలాంటి ఉండవల్లి.. ప్రగతి భవన్ వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ పిలుపుతోనే ఉండవల్లి అతన్ని కలిసేందుకు వెళ్లారని తెలుస్తోంది.

కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాట్లలో ఉన్న సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ తో సమావేశం కావడంపై పలు రకాల చర్చలు సాగుతున్నాయి. జాతీయ రాజకీయాలపై మంచి అవగాహన ఉన్న ఉండవల్లితో తన భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ చర్చించారని అంటున్నారు. జాతీయ స్థాయిలో కొత్త పార్టీకి అవకాశం ఉందా.. ఎలాంటి పరిణామాలు ఉంటాయి.. ఎలా ముందుకు వెళ్లాల్లి అన్న అంశాలపై ఉండవల్లి నుంచి కేసీఆర్ సలహాలు, సూచనలు తీసుకున్నారని తెలుస్తోంది. జాతీయ పార్టీ పెడితే.. ఏపీలోనూ యాక్టివ్ కావాల్సి ఉంటుంది. అందులో భాగంగానే తన పార్టీ ఏపీ బాధ్యతలను ఉండవల్లి అరుణ్ కుమార్ కు అప్పగించే యోచనలోకేసీఆర్ ఉన్నారని అంటున్నారు. ఈ ప్రతిపాదననే ఉండవల్లికి కేసీఆర్ చెప్పారని తెలుస్తోంది.

కాంగ్రెస్ నుంచి రాజమండ్రి ఎంపీగా గెలిచిన ఉండవల్లి.. ఏపీ విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. అయితే కేసీఆర్ ప్రతిపాదనపై ఉండవల్లి అరుణ్ కుమార్ ఎలాంటి స్పందన వ్యక్తం చేశారన్నది తెలియడం లేదు. 

Read also: Prathyusha Garimella Suicide: నొప్పి లేకుండా చనిపోవడమెలా.. నెట్‌లో సెర్చ్ చేసిన ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల...

Read also: Telangana schools: తెలంగాణలో తెరుచుకున్న స్కూల్స్.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం     

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
CM KCR TALKS WITH AP LEADER UNDAVALLI ARUNKUMAR ON NATIONAL PARTY DIRECTION OS PRASHANTH KISHOR
News Source: 
Home Title: 

KCR NEW PARTY: ఉండవల్లికి బీఆర్ఎస్ పార్టీ ఏపీ బాధ్యతలు? పీకే డైరెక్షన్ లో కేసీఆర్ స్కెచ్..

KCR NEW PARTY: ఉండవల్లికి బీఆర్ఎస్ పార్టీ ఏపీ బాధ్యతలు? పీకే డైరెక్షన్ లో కేసీఆర్ స్కెచ్.
Caption: 
FILE PHOTO KCR UNDAVALLI
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

జాతీయ పార్టీపై ఫోకస్ పెంచిన కేసీఆర్

ఉండవల్లితో కేసీఆర్ కీలక చర్చలు

ఉండవల్లికి BRS పార్టీ ఏపీ బాధ్యతలు?

 

Mobile Title: 
KCR NEW PARTY:ఉండవల్లికి బీఆర్ఎస్ పార్టీ ఏపీ బాధ్యతలు? పీకే డైరెక్షన్ లో కేసీఆర్..
Srisailam
Publish Later: 
No
Publish At: 
Monday, June 13, 2022 - 10:04
Request Count: 
90
Is Breaking News: 
No