MLA Anil Kumar Yadav: సంచలన పరిణామం.. ఆ 18 మందిలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు..?

CM Jagan-MLA Anil Kumar Yadav Meet: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార పార్టీ అభ్యర్థులను రెడీ చేసుకుంటుడగా.. విపక్షాలు యాత్రలతో బిజీగా ఉన్నాయి. ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అవుతారోనని ఏపీ ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Jun 27, 2023, 06:44 AM IST
MLA Anil Kumar Yadav: సంచలన పరిణామం.. ఆ 18 మందిలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు..?

CM Jagan-MLA Anil Kumar Yadav Meet: వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అధికార వైసీపీ పకడ్బందీగా సిద్ధమవుతోంది. 175కి 175 స్థానాల్లో విజయం సాధించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు వర్క్‌షీట్ ఇచ్చిన జగన్.. 'గడప గడపకు' కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ.. సరిగా నిర్వహించలేని వారికి టికెట్లు ఇచ్చేది లేదని ముందు నుంచే హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం 18 మంది ఎమ్మెల్యేలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కష్టమని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ లిస్టులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా ఉందని ఓ వార్త వైరల్ అవుతోంది. 

సోమవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో అనిల్ కుమార్ భేటీ అనంతరం ఈ వార్త తెరపైకి వచ్చింది. ఇటీవల గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష కార్యక్రమాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ వైసీపీ నేతలు హాజరవ్వగా.. అనివార్య కారణాల వల్ల అనిల్ కుమార్ యాదవ్ హాజరు కాలేకపోయారు. ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. 18 మంది ఎమ్మెల్యేల పనితీరు అస్సలు బాగాలేదని.. ఆ 18 మందితో తాను వ్యక్తిగతంగా మాట్లాడుతానని చెప్పారు. ఇక మిగిలినవారిలో కూడా సగం మంది పనితీరు ఇంకా మెరుగుపరుచుకోవాలని సూచించారు.

ఈ నేపథ్యంలో సీఎం జగన్‌తో అనిల్ కుమార్ యాదవ్‌ సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఆ 18 మందిలో అనిల్ కూడా ఉన్నారా..? అనే చర్చ మొదలైంది. కాగా.. నెల్లూరులో గ్రూప్ రాజకీయాలు తారాస్థాయిలో జరుగుతున్న నేపథ్యంలోనే అనిల్‌ను పిలిచినట్లు తెలుస్తోంది. అందరినీ కలుపుకుని వెళ్లాలని సీఎం సూచించినట్లు సమాచారం. ఎన్నికలకు ఎక్కువ సమయం లేదని.. పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని చెప్పినట్లు తెలిసింది.

ఇక ఇటీవల ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తన రాజకీయ భవిష్యత్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తనని కోస్తే తన రక్తంలో కూడా సీఎం జగన్ ఉంటాంటూ అభిమానం చాటుకున్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా.. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా.. తనను వైఎస్సార్సీపీ నుంచి దూరం చేయలేరని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి మూడోసారి కూడా తానే బరిలో ఉంటానని క్లారిటీ ఇచ్చారు. మళ్లీ తానే గెలుస్తానని.. పోటీకి ఎవరు వస్తారో రండి చూసుకుందామంటూ ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. నెల్లూరు ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ తనకు ఉంటాయన్నారు. 

Also Read: Nalugella Narakam Campaign: నాలుగేళ్ల నరకం.. జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే లక్ష్యంగా టీడీపీ కొత్త ప్రయత్నం

Also Read: World Cup 2023 Schedule: వరల్డ్‌ ఫైనల్, సెమీ ఫైనల్స్ వేదికలు ఫిక్స్..! ఎక్కడంటే..?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News