Eluru Mysterious Disease: వారి శరిరంలోకి సీసం ఎలా వెళ్లింది? ఆరా తీసుస్తున్న జగన్!

Eluru Mysterious Disease | గత కొన్ని రోజులుగా ఏలూరు నగర ప్రజలతో పాటు దేశ ప్రజలకు కలవర పెడుతున్న వింత వ్యాధిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సోమవారం రోజు బాధితులను పరామర్శించిన జగన్ ప్రపంచ ఆరోగ్యం సంస్థ సహాయం కోరారు. 

Last Updated : Dec 8, 2020, 09:09 PM IST
    1. గత కొన్ని రోజులుగా ఏలూరు నగర ప్రజలతో పాటు దేశ ప్రజలకు కలవర పెడుతున్న వింత వ్యాధిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
    2. సోమవారం రోజు బాధితులను పరామర్శించిన జగన్ ప్రపంచ ఆరోగ్యం సంస్థ సహాయం కోరారు.
Eluru Mysterious Disease: వారి శరిరంలోకి సీసం ఎలా వెళ్లింది? ఆరా తీసుస్తున్న జగన్!

Eluru Mysterious Disease | గత కొన్ని రోజులుగా ఏలూరు నగర ప్రజలతో పాటు దేశ ప్రజలకు కలవర పెడుతున్న వింత వ్యాధిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సోమవారం రోజు బాధితులను పరామర్శించిన జగన్ ప్రపంచ ఆరోగ్యం సంస్థ సహాయం కోరారు. వారు ఈ రోజు ఏలూరు చేరుకున్నారు. అదే సమయంలో ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన వైద్యులు వచ్చి పరిక్షలు నిర్వహించారు. బాధితుల శరీరంలో సీసం ఎక్కువగా ఉంది అని తెలిపారు. 

Also Read | Eluru mystery disease: అంతుచిక్కని ఏలూరు వింత వ్యాధి లక్షణాలు..జాగ్రత్తలు

అయితే బాధితుల పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన జగన్ (CM Jagan).. ప్రజల అస్వస్థతకు దారి తీసిన కారణాలను పూర్తి స్థాయిలో పరిశోధించాలని సిఎం జగన్‌ అధికారుల ఆదేశించారు. అసలు వారి శరీరంలో అంత మోతాదులో సీసం ఎలా వెళ్లిందో తెలుసుకోమని అధికారులను ఆదేశించారు. అయితే ఐఐసీటి కూడా పరీక్షలు చేస్తోంది అని.. త్వరలో వివరాలు తెలుస్తాయి అని అధికారులు తెలిపారు.

Also Read | AP: జగన్ పుట్టినరోజున గొప్ప కానుక..మీ ఆస్థుల్ని రక్షించే పథకం ప్రారంభం

టెస్టుల తరువాత తేలిన అంశాలను నివేదిక రూపంలో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అంత ప్రమాదకరమైన సీసం మూలాలు ఏలూరు (Eluru) ప్రజల శరీరంలో ఎలా చేరాయో తెలుసుకోమన్నారు. అనారోగ్యానికి దారితీసిన కారణాలు, మార్గాలను గుర్తించాలని స్పష్టం చేశారు. రేపు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News