AP Politics: ప్రభుత్వ వ్యతిరేక ఓటు సంఘటితమయ్యేనా, మారుతున్న రాజకీయ పరిణామాలు

AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. అధికార పార్టీకు వ్యతిరేకంగా ప్రతిపక్షం ఏకం కానుంది. ఇప్పటికే రెండు పార్టీల స్నేహం బలపడింది. మరో పార్టీ విషయంలో స్పష్టత రావల్సి ఉంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 21, 2022, 07:41 AM IST
 AP Politics: ప్రభుత్వ వ్యతిరేక ఓటు సంఘటితమయ్యేనా, మారుతున్న రాజకీయ పరిణామాలు

AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. అధికార పార్టీకు వ్యతిరేకంగా ప్రతిపక్షం ఏకం కానుంది. ఇప్పటికే రెండు పార్టీల స్నేహం బలపడింది. మరో పార్టీ విషయంలో స్పష్టత రావల్సి ఉంది. 

ఏపీలో అధికార పార్టీ అప్పుడే ఎన్నికల సందడి ప్రారంభించేసింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దీనికి సంబంధించి కీలక సూచనలు చేశారు. ప్రజల్లో ఉండాల్సిందిగా నేతలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపక్షం కలిసి వస్తోందని సంకేతాలిచ్చారు. సర్వే ఆధారంగా టికెట్లు ఉంటాయన్నారు. ఈ నేపధ్యంలో రానున్న ఎన్నికల్లో 2014 నాటి ముఖచిత్రం పునరావృతం కానుందని తెలుస్తోంది. 

2014లో జనసేన పార్టీ పెట్టినా..ఎన్నికల్లో పోటీకు దూరంగా ఉన్నారు పవన్ కళ్యాణ్. బీజేపీ, టీడీపీలకు నేరుగా మద్దతు పలికి..ఆ రెండు పార్టీల తరపున ప్రచారం నిర్వహించారు. 2019 నాటికి పరిస్థితి మారింది. బీజేపీ, టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేశాయి. ఈసారి అదే పరిస్థితి రిపీట్ కానుంది. అయితే ఈసారి జనసేన కూడా స్వయంగా బరిలో ఉండనుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని ఇప్పటికే పవన్ కళ్యాణ్ బహిరంగంగానే వెల్లడించారు. బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా జనసేనతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తామని..బీజేపీ రోడ్ మ్యాప్ సిద్ధమౌతోందని తెలిపింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని స్పష్టం చేశారు. 

ఇక తెలుగుదేశం నుంచి ఇంకా స్పష్టత రావల్సి ఉంది. టీడీపీతో పొత్తు విషయంలో ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదని..అంతా మీడియా కల్పితమని సోము వీర్రాజు చెప్పారు. టీడీపీతో పొత్తు గురించి చర్చించలేదని చెప్పారు కానీ..ఉండదని మాత్రం చెప్పలేదు. అదే సమయంలో ఇటు జనసేన అటు బీజేపీ రెండు పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఆలోచనలో ఉన్నాయి. ఇంకోవైపు జనసేన-టీడీపీ మధ్య బంధం పరోక్షంగా కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో, రేట్ల విషయంలో టీడీపీ శ్రేణులు బాహాటంగానే జనసైనికులకు మద్దతిచ్చారు. బీజేపీతో కలిసి ప్రయాణించే విషయమై..జనసేన ద్వారా మార్గం సుగమం చేసుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందనే వాదన కూడా ఉంది. బీజేపీతో పొత్తు ఉండదని టీడీపీ కూడా ఇప్పటివరకూ తేల్చిచెప్పలేదు. 

భవిష్యత్ అవసరాలు, రాజకీయ సమీకరణాలు, ప్రభుత్వ వ్యతిరేక ఓటును సంఘటితం చేయడం మాత్రమే ప్రతిపక్షాలకు ఇప్పుడు కీలకం. ఆ దిశగా పయనించాలంటే మూడు పార్టీలు తప్పనిసరిగా కలవాల్సిందే. ఇప్పటికే రెండు పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ వెలువడింది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం విషయంలో స్పష్టత మిగిలింది. 

Also read: APSSDC Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఏపీఎస్ఎస్‌డీసీ జాబ్ మేళా.. పూర్తి వివరాలివే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News