Chandrababu New Passbooks: గత ప్రభుత్వంలో ప్రతి పథకానికి నాటి ముఖ్యమంత్రి ఫొటోలు, ఆ పార్టీ రంగులు కనిపించగా.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్నింటినీ తొలగించేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులను తీసేస్తోంది. ఈ క్రమంలో మరో ముఖ్యమైన నిర్ణయం టీడీపీ ప్రభుత్వం తీసుకుంది. రైతులకు సంబంధించిన పాసు పుస్తకాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోను తొలగించనున్నారు. ఈ సందర్భంగా కొత్త పాసు పుస్తకాలను అందిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
Also Read: Amaravati Committee: రాజధాని అమరావతిపై కీలక ముందడుగు.. ఏపీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు
రాజధాని అమరావతిలో పాసు పుస్తకాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో చర్చించి కొత్తగా రూపొందించిన రైతు పాసు పుస్తకాలను ప్రదర్శించారు. త్వరలో రైతులందరికీ ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.
Also Read: Talliki Vandanam Scheme: తల్లికి వందనంపై కీలక ప్రకటన.. ఎంత మంది ఉంటే వారికి రూ.15 వేలు
'త్వరలో ప్రభుత్వ రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తాం. ప్రజల పాసు పుస్తకాలపై వైఎస్ జగన్ తన బొమ్మల కోసం రూ.15 కోట్లు తగలేశారు' అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 'ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు ప్రజల కోరిక మేరకు రాజముద్రతో కొత్త పాసు పుస్తకాలు ఇచ్చేందుకు నిర్ణయించాం' అని తెలిపారు. గత ప్రభుత్వం రీ సర్వే పేరుతో పొలాల సర్వేకి భారీగా నిధులు ఖర్చు చేసిందని ఆరోపించారు.
'సరిహద్దు రాళ్లపైనా తన బొమ్మలు ఉండాలని నాటి సీఎం వైఎస్ జగన్ కోరుకున్నారు. ఆ కోరిక తీర్చేందుకు రూ.650 కోట్లు ఖర్చు చేశారు' అని చంద్రబాబు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం చెప్పిన రీ సర్వేలో ఎక్కడా రాళ్లు పాతమని చెప్పకపోయినా తన బొమ్మల కోసం నాటి సీఎం గ్రానైట్ రాళ్లు సిద్దం చేశారు అని తెలిపారు. ఈ సందర్భంగా జగన్ బొమ్మ ఉన్న 77 లక్షల గ్రానైట్ రాళ్లను ఏమి చేయాలి అనేదానిపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
అయితే ఆ రాళ్లపై ఉన్న జగన్ బొమ్మలు చెరపడానికి మరో రూ.15 కోట్లు ఖర్చు అవుతుందని తాత్కాలికంగా అధికారులు అంచనా వేశారు. జగన్ బొమ్మల పిచ్చి వల్ల మొత్తంగా రూ.700 కోట్ల వరకు ప్రజా సొమ్ము వృథా అని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఆ గ్రానైట్ రాళ్లను ఎలా ఉపయోగించుకోవచ్చు.. వాటితో ఏం చెయ్యవచ్చో చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశించారు.
పాసు పుస్తకం ప్రత్యేకతలు
- ప్రభుత్వ రాజముద్ర అయిన పూర్ణకుంభం పాసు పుస్తకం ముందుభాగంలో ఉంటుంది.
- క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆస్తి వివరాలు, ఆ ఆస్తి అడ్రస్ వద్దకు తీసుకువెళ్లే మ్యాప్ కూడా వచ్చేలా ఏర్పాటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి