Chandrababu Case: చంద్రబాబుకు మళ్లీ ఆంక్షలు విధించిన సుప్రీంకోర్టు, విచారణ వాయిదా

Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు కాస్త ఉపశమనం లభించింది. కానీ సుప్రీంకోర్టు తాజాగా ఆంక్షలు విధించింది. కేసు విచారణను డిసెంబర్ 11కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు చంద్రబాబుకు విధించిన ఆంక్షలేంటో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 28, 2023, 04:06 PM IST
Chandrababu Case: చంద్రబాబుకు మళ్లీ ఆంక్షలు విధించిన సుప్రీంకోర్టు, విచారణ వాయిదా

Chandrababu Case: తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాజకీయ పర్యటనలకు గ్రీన్ సిగ్నల్ లభించింది.స్కిల్ కేసులో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సీఐడీ దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు చంద్రబాబుకు గతంలో విధించిన ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు 52 రోజుల తరువాత ఏపీ హైకోర్టు తొలుత నాలుగు వారాల మద్యంతర బెయిల్ ఆరోగ్య కారణాలతో మంజూరు చేసింది. ఈ సందర్బంగా రాజకీయ సభలు, ర్యాలీల్లో పాల్గొనకూడదని, స్కిల్ కేసు గురించి ఎక్కడా మాట్లాడకూడదని ఆంక్షలు విధించింది. అనంతరం రెగ్యులర్ బెయిల్ పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆంక్షలు సడలించింది. పాత ఆంక్షలు రేపటి వరకూ అమల్లో ఉన్నందున ఎల్లుండి నుంచి అంటే నవంబర్ 30 నుంచి చంద్రబాబు నాయుడు రాజకీయ కార్యకలాపాలకు ప్లాన్ చేసుకున్నారు. నవంబర్ 30 నుంచి తిరుమల, శ్రీశైలం పుణ్యక్షేత్రాల సందర్శనతో పాటు రాజకీయ సభలకు ప్లాన్ చేశారు. ఇప్పుడీ పర్యటనలు కొనసాగుతాయా లేదా అనేది ఇంకా క్లారిటీ రావల్సి ఉంది. 

ఈలోగా చంద్రబాబుకు బెయిల్ మంజూ చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీఐడీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఇవాళ ఈ పిటీషన్‌‌పై వాదనలు జరిగాయి. సీఐడీ తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు విన్పించారు. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు, ఆంక్షల మినహాయింపుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసును విచారించిన జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్రల ధర్మాసనం కేసు విచారణను డిసెంబర్ 11కు వాయిదా వేసింది. అదే సమయంలో గతంలో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు మద్యంతర బెయిల్ ఇచ్చేటప్పుడు విధించిన ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. స్కిల్ కేసు గురించి బయటెక్కడా మాట్లాడవద్దని స్పష్టం చేసింది. 

మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పుడు పబ్లిక్ ర్యాలీలు, రాజకీయ సభల్లో పొల్గొనకూడదన్న షరతును సుప్రీంకోర్టు తాజాగా మినహాయించింది. అంటే రాజకీయ ర్యాలీలకు చంద్రబాబుకు అనుమతి ఉంటుంది. నవంబర్ 30 నుంచి చంద్రబాబు ప్లాన్ చేసుకున్న కార్యక్రమాలకు విఘాతం ఉండకపోవచ్చు. 

Also read: Schools Closed: తెలంగాణలో రెండ్రోజులు విద్యాసంస్థలకు సెలవులు, డిసెంబర్ 1న తిరిగి ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News