AP Special Status: ఏపీకు ప్రత్యేక హోదా హుళక్కే, లేదని చెప్పేసిన కేంద్రం

AP Special Status: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇక లేనట్టేనని మరోసారి స్పష్టమైంది. 25 మంది ఎంపీలనిస్తే హోదా ఎందుకు రాదో అన్న వైఎస్ జగన్ మాటలు సైతం నీరుగారిపోయాయి. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 12, 2022, 08:08 PM IST
AP Special Status: ఏపీకు ప్రత్యేక హోదా హుళక్కే, లేదని చెప్పేసిన కేంద్రం

రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ఏపీ ప్రత్యేక హోదా అనేది అప్పటి నుంచి ఎన్నికల్లో ఓ ప్రధాన అంశంగా మారింది. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇచ్చేసింది. హోదా ఇక లేదని తేలిపోయింది. 

విభజన సమయంలో ఏపీకు ప్రత్యేక హోదా ఇస్తామనేది ఓ హామీ. ఎన్నికల సమయంలో ప్రతి పార్టీ ఈ అంశాన్ని వాడుకున్నదే. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని 2014 ఎన్నికల్లో ఉదహరించిందే. ఎన్నికలు ముగిశాక పక్కనపడేసింది. 2019 ఎన్నికల్లో 25 మంది ఎంపీలనిస్తే హోదా ఎందుకు రాదో చూద్దాం అన్న ఏపీ ముఖ్యమంత్రి మాటలు కూడా చెల్లలేదు. ఏపీకు హోదా ఇవ్వలేమని పలు సందర్భాల్లో తేల్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరోసారి క్లారిటీ ఇచ్చింది. 

ఏపీ ప్రత్యేక హోదా అంశం ప్రస్తుతం ఉనికిలోనే లేదని రాజ్యసభ సాక్షిగా కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వకంగా స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రానికి కూడా హోదా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు. వివిధ కారణాలు, ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చిందన్నారు. 14వ ఆర్ధిక సంఘం కేటగరీ రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీలో ఏ విధమైన వ్యత్యాసం చూపలేదని స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు మంత్రి వివరణ ఇచ్చారు.

ఇక పోలవరం ప్రాజెక్టుపై కూడా వివరణ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ఎప్పటిలోగా పూర్తి చేస్తారని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. షెడ్యూల్ ప్రకారం 2024 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం కష్టమేనంది. 

Also read: Ganta Srinivasarao: పార్టీ మార్పుపై గంటా శ్రీనివాసరావు క్లారిటీ.. ఇది పక్కా స్టేట్‌మెంట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News