AP: CAG Report: చంద్రబాబు ప్రభుత్వం..ఇతర అవసరాలకే అప్పులు చేసింది

AP: CAG Report: ఏపీ మాజీ ముఖ్యమంత్రి , ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆ తప్పులు కూడా జరిగాయా..ఇతరావసరాలకు అప్పులు చేశారా..కాగ్ నివేదిక ఇదే చెబుతోంది. గత ప్రభుత్వం చేసిన అప్పుల్లో పెద్ద ఎత్తున తప్పులు చోటు చేసుకున్నాయంటోంది.

Last Updated : Dec 11, 2020, 11:31 AM IST
  • చంద్రబాబు హయాంలో అప్పుల్లో తప్పులు జరిగాయని స్పష్టం చేసిన కాగ్ నివేదిక
  • చేసిన అప్పుల్ని ఇతర అవసరాలకు వినియోగించారని తెలిపిన కాగ్
  • ఫలితంగా అప్పులు పెరిగినా..ఆస్థులు పెరగలేదని చెప్పిన కాగ్ నివేదిక
AP: CAG Report: చంద్రబాబు ప్రభుత్వం..ఇతర అవసరాలకే అప్పులు చేసింది

AP: CAG Report: ఏపీ మాజీ ముఖ్యమంత్రి , ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆ తప్పులు కూడా జరిగాయా..ఇతరావసరాలకు అప్పులు చేశారా..కాగ్ నివేదిక ఇదే చెబుతోంది. గత ప్రభుత్వం చేసిన అప్పుల్లో పెద్ద ఎత్తున తప్పులు చోటుచేసుకున్నాయంటోంది.

కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ( CAG Report ) నివేదిక. ప్రభుత్వ ఖర్చులు, అప్పులకు సంబంధించిన ఆడిట్ అనవచ్చు. ప్రభుత్వంలో జరిగే తప్పులు ఎక్కువగా కాగ్ నివేదిక ద్వారా బట్టబయలవుతుంటాయి. ఇప్పుడదే జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం ( Chandrabau Government ) ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులపై కాగ్ నివేదిక చాలా తప్పుల్నే ఎత్తి చూపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు..ఆస్థుల కల్పనకు కాకుండా ఇతర అవసరాలకే వినియోగించినట్టు కాగ్ ( CAG ) స్పష్టం చేసింది. 

Also read: AP: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చంద్రబాబు లేఖ

2014-15 ఆర్ధిక సంవత్సరం నుంచి 2018-19 వరకూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పుల్లో ఆస్థుల్ని సమకూర్చుకోడానికి ఏ మేరకు ఖర్చు పెట్టిందనేది కాగ్ నివేదిక ( CAG Report ) వెల్లడించింది.2014-15 అంటే తొలి ఏడాదిలో చేసిన అప్పుల్లో సగం కూడా ఆస్థుల కల్పనకు వినియోగించలేదని కాగ్ తెలిపింది. 

2014-15 తొలి ఏడాదిలో 21 వేల 481 కోట్లు అప్పు చేయగా..అందులో ఆస్థుల కల్పనకు కేవలం 7 వేల 265 కోట్లే ఖర్చు పెట్టింది అప్పటి ప్రభుత్వం. ఇక మరుసటి ఏడాది అంటే 2015-16లో 22 వేల 375 కోట్లు అప్పులు చేయగా..14 వేల 845 కోట్లు ఆస్థుల కల్పనకు వినియోగించింది. 2016-17 సంవత్సరంలో 30 వేల 769 కోట్లు అప్పు చేయగా..15 వేల 708 కోట్ల రూపాయల్ని ఆస్థుల కల్పనకు ఖర్చు చేసింది. ఇక 2017-18లో 28 వేల 203 కోట్లు అప్పు చేయగా.. 16 వేల 272 కోట్లు ఆస్థుల కల్పనకు ఉపయోగించింది. ఇక 2018-19 ఏడాదికి 38 వేల 112 కోట్లు అప్పు చేసి...అందులో 21 వేల 819 కోట్ల రూపాయల్ని ఆస్థుల కల్పనకు వినియోగించింది. Also read: Vizag Shipyard jobs: విశాఖలో షిప్‌యార్డులో ఉద్యోగాలు..వెంటనే అప్లై చేయండి

Trending News