BJP Telugu States: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపికి కలిసొచ్చిన ఆ సంఖ్య..

BJP Telegu States : ఒక్కో వ్యక్తితో పాటు ఒక్కో పార్టీకి ఒక్కో లక్కీ నెంబర్ ఉంటుంది. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి రెండు రాష్ట్రాల్లో ఓ నెంబర్ లక్కీగా కలిసొచ్చింది. దీని గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 7, 2024, 03:53 PM IST
BJP Telugu States: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపికి కలిసొచ్చిన ఆ సంఖ్య..

BJP Telegu States : 2024లో దేశ వ్యాప్తంగా 18వ లోక్ సభ  జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో ఎన్టీయే కూటమి 293 సీట్లను కైవసం చేసుకుంది. మరోవైపు భారతీయ జనతా పార్టీకి 240 సీట్లు వచ్చాయి. మెజారిటీకి 32 సీట్ల దూరంలో ఆగిపోయినా.. కూటమిగా అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలోకి రావడానికి తెలుగు రాష్ట్రాల్లో పాటు కర్ణాటక, ఒడిషా కీలక భూమిక పోషించింది. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపి తెలంగాణలో 17 సీట్లలో పోటీ చేసింది. అందులో 8 లోక్ సభ సీట్లును గెలచుకుంది. నియోజకవర్గాల వారీగా చూస్తే..  ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంగనర్, సికింద్రాబాద్, చేవేళ్ల, మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్, మెదక్ స్థానాల్లో కాషాయ జెండా ఎగిరింది.  

అంతకు ముందు జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి మొత్తంగా 8 శాసన సభ స్థానాలు దక్కాయి. అటు ఆంధ్ర ప్రదేశ్ లో కూటమిగా ఎన్నికల బరిలో దిగిన భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో పోటీ చేస్తే అక్కడ 8 అసెంబ్లీ సీట్లలో బీజేపీ గెలిచింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి 8 లక్కీ నెంబర్ గా సోషల్ మీడియల బీజేపీ అభిమానులు చెప్పుకుంటున్నారు.  

ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తెలంగాణలో తమ పార్టీ 8 సీట్లు సాధిస్తుందని ఘంటాపథంగా చెప్పారు. చెప్పినట్టే ఇక్కడ 8 సీట్లు గెలుచుకుంది. మరోవైపు ఏపీలో పోటీచేసిన 10 స్థానాల్లో 4 నుంచి 5 స్థానాల్లో గెలుస్తామని చెప్పారు. కానీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ 8 స్థానాల్లో విజయం వరించడం చెప్పుకోదగ్గ పరిణామం.

Also read: Richest MP List: దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా గుంటూరు టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్, టాప్ 6 జాబితా ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News