TTD and Andhrojyothi: తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతిష్ఠ విషయంలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ఓ పత్రిక ఆ ప్రతిష్ఠను దిగజార్చుతోందని మండిపడ్డారు.
హిందూవులకు పవిత్రమైన తిరుమల, తిరుపతి దేవస్థానాల(TTD) ప్రతిష్ఠను ఆంధ్రజ్యోతి పత్రిక దిగజార్చుతోందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి(Subrahmanya swamy)మండిపడ్డారు. సమాజంలో మత కలహాల్ని రెచ్చగొట్టే విధంగా తప్పుడు కథనాలు ప్రచురించిందని రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి ఏపీ హైకోర్టుకు వివరించారు. ఆ పత్రికలోని కథనాల వెనుక దురుద్దేశాలున్నాయని తెలిపారు. టీటీడీపై ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంగా నెలరోజుల్లోగా దర్యాప్తు పూర్తిచేసి నివేదిక దాఖలు చేయనున్నామని డీజీపీ కౌంటర్ దాఖలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అప్పటి వరకూ హైకోర్టు ఈ అంశాన్ని పర్యవేక్షించాలన్నారు.
ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అందించిన వివరాల్ని హైకోర్టు(Ap High Court) పరిగణలో తీసుకుని విచారణను సెప్టెంబర్ 29కు వాయిదా వేసింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతాల ప్రచారం జరుగుతోందంటూ ఆ పత్రిక అసత్య కథనం ప్రచురించిందని టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారి ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదుపై లోతుగా విచారణ జరిపేలా పోలీసుల్ని ఆదేశించాలని కోరుతూ డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
Also read: AP Government: ఏపీలో వేయి కోట్లతో కొత్త పరిశ్రమ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో చర్చలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook