Kesineni vs CM Ramesh: ఆంధ్రప్రదేశ్ టీడీపీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రకంపనలు కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా రోజుకో సంచలన వ్యాఖ్యలు చేస్తూ కాక రేపుతున్నారు కేశినేని నాని. సొంత పార్టీతో పాటు అధినేత చంద్రబాబుపైనా తీవ్రమైన కామెంట్లు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ గెలవదంటూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీని షేక్ చేస్తున్నాయి. నాని కామెంట్లు టీడీపీలో కలకలం రేపుతుండగా.. ఆ వార్తను వైరల్ చేస్తూ వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. గతంలో టీడీపీలో యాక్టివ్ రోల్ పోషించి ప్రస్తుతం బీజేపీలో ఉన్న సీఎం రమేష్ ను ఉద్దేశించి కేశినేని చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి.
తనపై కేశినేని చేసిన ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్. నాపై అసందర్భంగా, సత్య దూరమైన ఆరోపణలు.. కల్పితాలు ప్రచారం చేయడం మాని తమ కుటుంబ వ్యవహారాలు, వాళ్ళ పార్టీలో లుకలుకలు సరిచేసుకోవడం మీద దృష్టి పెడితే మంచిదని సూచిస్తున్నాను. “ఊహలకు, ఊహాజనిత వార్తలకు నిజాలు కానీ, ఆధారాలు కానీ అవసరం లేదు" అంటూ సీఎం రమేష్ ట్వీట్ చేశారు.
నాపై అసందర్భంగా, సత్య దూరమైన ఆరోపణలు.. కల్పితాలు ప్రచారం చేయడం మాని తమ కుటుంబ వ్యవహారాలు, వాళ్ళ పార్టీలో లుకలుకలు సరిచేసుకోవడం మీద దృష్టి పెడితే మంచిదని సూచిస్తున్నాను.
“ఊహలకు, ఊహాజనిత వార్తలకు నిజాలు కానీ, ఆధారాలు కానీ అవసరం లేదు"
— Dr. CM Ramesh (@CMRamesh_MP) July 22, 2022
బుధవారం ఢిల్లీలో మీడియాతో ఆఫ్ ద రికార్డ్ గా మాట్లాడిన కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర లో ఏక్ నాథ్ షిండేలా టీడీపీకి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 50, 60 సీట్లు వస్తే ఏక్ నాథ్ షిండే లా సీఎం రమేష్ తో ఆపరేషన్ నిర్వహిస్తారంటూ బాంబ్ పేల్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏపీలో టీడీపీ గెలవడం అసాధ్యమన్నారు కేశినేని నాని. గెలిచే శక్తి, యుక్తి చంద్రబాబుకు లేదన్నారు. ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా మాట్లాడే నేతల మాటలు చంద్రబాబు నమ్మరని.. బ్రోకర్లు, లోఫర్ల మాటలే ఆయన వింటారని కేశినేని నాని అన్నారు. బ్రోకర్లు, లోఫర్ల మాటలే వింటారంటూ కేశినేని సీఎం రమేష్ ను ఉద్దేశించే మాట్లాడారనే ప్రచారం సాగుతోంది. గతంలో టీడీపీలోనూ సీఎం రమేష్ కు కేశినేని నానికి పడేది కాదంటున్నారు. రమేష్ బీజేపీలో ఉన్నా సరే టీడీపీలో జరిగే ప్రతి విషయం ఆయన తెలుస్తుందనే టాక్ ఉంది.
Also read:CBSE 10th Results: సీబీఎస్‌ఈ పది ఫలితాలు విడుదల..రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..!
Also read:Rain Alert: తెలంగాణలో రెయిన్ అలర్ట్..ఐదురోజులపాటు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook