కన్నా ఒక్క నిమిషం ఆగు - అమిత్ షా బుజ్జగింపు

 బీజేపీ నేతల వలసలకు చెక్ పెట్టే దిశగా అమిత్ షా అడుగులు వేస్తున్నారు.

Last Updated : Apr 25, 2018, 08:37 PM IST
కన్నా ఒక్క నిమిషం ఆగు - అమిత్ షా బుజ్జగింపు

ఏపీలో రాజకీయ పరిణామాలు శర వేగంగా మారుతున్నాయి. బీజేపీ వీడి వెళ్లాలని భావిస్తున్న నేతలను బుజ్జగించేందుకు హైకమాండ్ రంగంలోకి దిగింది. ఇప్పటికే బీజేపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని ముహుర్తం రెడీ చేసుకున్న సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణకు స్వయంగా అమిత్ షా ఫోన్ చేసి బీజేపీలోనే ఉండాలని కోరినట్లు తెలిసింది. దీంతో ఆయన మనసు మార్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.అందుకే కన్నా  వైసీపీలో చేరే కార్యక్రమాన్ని ఆపేసి.. ఆసుపత్రిలో చేరారని అంటున్నారు. అలాగే పార్టీ మారాలనుకుంటున్న నేతలను నిలువరించాలని రాష్ట్ర నేతలకు అమిత్ షా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది..

జగన్‌కు అమిత్ షా మెసేజ్ ?
బీజేపీ నుంచి వస్తున్న నేతలను వైసీపీలో చేర్చుకోవద్దని అమిత్ షా జగన్‌కు వర్తమానం పంపినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే జగన్ రియాక్షన్ ఏంటనేది ఇంకా తెలియరాలేదు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమలనాథులతో చేతులు కలపాలని భావిస్తున్నట్లు  జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన నేతలను వైసీపీలో చేర్చుకునే సాహనం జగన్ చేయరనే టాక్ వినిపిస్తుంది. 

Trending News