BJP vs ABN Channel: ఏబీఎన్ ఛానెల్, ఆంధ్రజ్యోతి పత్రికల్ని బహిష్కరించిన బీజేపీ

BJP vs ABN Channel: ఏబీఎన్ ఛానెల్, పత్రికపై భారతీయ జనతా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ నేతపై లైవ్‌లో దాడి నేపధ్యంలో ఆంధ్రజ్యోతి పత్రిక, ఛానెల్‌ను బహిష్కరిస్తున్నట్టు బీజేపీ అధికారికంగా ప్రకటించింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 25, 2021, 12:11 AM IST
  • బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై ఏబీఎన్ ఛానెల్ లైవ్ ప్రసారంలో చెప్పుతో దాడి
  • ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఏపీ శాఖ
  • ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఛానెళ్లను బహిష్కరించిన ఏపీ బీజేపీ
BJP vs ABN Channel: ఏబీఎన్ ఛానెల్, ఆంధ్రజ్యోతి పత్రికల్ని బహిష్కరించిన బీజేపీ

BJP vs ABN Channel: ఏబీఎన్ ఛానెల్, పత్రికపై భారతీయ జనతా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ నేతపై లైవ్‌లో దాడి నేపధ్యంలో ఆంధ్రజ్యోతి పత్రిక, ఛానెల్‌ను బహిష్కరిస్తున్నట్టు బీజేపీ అధికారికంగా ప్రకటించింది. 

బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి( Bjp leader Vishnuvardhan reddy)పై ఏబీఎన్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో లైవ్‌లో దాడి జరిగింది. అమరావతి  రైతు కమిటీ తరపున చర్చకు హాజరైన శ్రీనివాస్ అనే వ్యక్తి బీజేపీ నేతపై బహిరంగంగానే లైవ్‌లో చెప్పుతో దాడి చేసి అవమానించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటనపై చింతించాల్సింది పోయి..తిరిగి అదే వ్యక్తిని ఇవాళ మరోసారి ఏబీఎన్ ఛానెల్ చర్చకు ఆహ్వానించింది. దాంతో బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

పత్రికా ప్రమాణాలు, టీవీ ఛానెల్‌ల నైతిక విలువలను గాలికొదిలేసి.. తెలుగుదేశం పార్టీ( Telugu Desam party) కరపత్రికలా, ప్రసార సాధనంలా పని చేస్తున్న ఏబీఎన్ ( ABN Channel), ఆంధ్రజ్యోతిని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. మీడియా ముసుగులో తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానెల్‌, ఆంధ్రజ్యోతి పత్రిక ( Andhrajyothi paper )లను నేటి నుంచి బహిష్కరిస్తున్నట్టు తెలిపింది. ఇక నుంచి జరిగే పార్టీ పత్రికా విలేకరుల సమావేశాలకు ఆంధ్రజ్యోతిని ఆహ్వానించరాదని, ఆ టీవీ ఛానల్‌లో జరిగే చర్చా కార్యక్రమాల్లో బీజేపీ ప్రతినిధులు పాల్గొనరాదని పార్టీ నిర్ణయించింది. బీజేపీ( BJP) తీసుకున్న నిర్ణయాన్ని ఉల్లంఘిస్తూ ఏబీఎన్ ఛానెల్ తమకు నచ్చినవారిని డిబేట్‌కు పిలిచి..ఆ వాయిస్‌ను పార్టీ వాయిస్‌గా  ప్రయత్నం చేస్తే ఏబీఎన్ యాజమాన్యంపై చట్టపరంగా చర్యలకు కూడా ఉపక్రమిస్తామని బీజేపీ స్పష్టం చేసింది. అంతేకాదు..ఆంధ్రజ్యోతి యాజమాన్యం బేషరతుగా క్షమాపణ చెప్పేంతవరకూ బహిష్కరణ కొనసాగుతుందన్నారు.

Also read: Ys jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో చారిత్రాత్మక నిర్ణయం, కేవలం ఒక్క రూపాయికే ఇళ్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News