Guaranteed Pension Scheme Notification: ఏపీలో మళ్లీ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) స్థానంలో జీపీఎస్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అమలు చేయలేదు. కానీ తాజాగా జీపీఎస్‌కు సంబంధించి నోటిఫికేసన్ విడుదల కావడం ఉద్యోగులను విస్మయానికి గురి చేస్తోంది. ఈ జీపీఎస్ ఫైల్‌పై జూన్ 12న అప్పుడు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న SS రావత్ సంతకం చేసినట్లు సమాచారం. ఆయన సెలవుపై వెళ్లే ముందు పెండింగ్ ఫైల్స్‌పై సంతకాలు చేశారు. ఇందులో జీపీఎస్‌కు సంబంధించిన ఫైల్ కూడా ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే రూపొందించిన ఈ నోటిఫికేషన్‌ను తాజాగా అప్‌లోడ్ చేయడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 20, 2023 నుంచి అమల్లో వస్తుందని గెజిట్‌లో పేర్కొన్నారు.
Also Read: Shankar: పాత చింతకాయ పచ్చడిలా మారిన శంకర్ పరిస్థితి.. ఇక గేమ్ చేంజర్ గతి అంతేనా!
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ను రద్దు చేసి.. ఓపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీమ్) 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్థిక భారం కారణంగా సీపీఎస్ స్థానంలో ఓపీఎస్ కాకుండా.. కొత్తగా జీపీఎస్ తీసుకువచ్చారు. జీపీఎస్ తమకు వద్దని ఉద్యోగులు చెప్పినా.. వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేసింది. అయితే ఎన్నికల ముందు ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించి అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం జూన్ 12న ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ జీపీఎస్ అమలుకు జీవో జారీ చేశారు. అయితే ఇంకా జీపీఎస్‌కు సంబంధించి మార్గదర్శకాలే రూపొందించకుండా నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం జీపీఎస్ అమలు చేయవద్దని కోరారు. జీపీఎస్‌పై కూటమి ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే అనూహ్యంగా జీపీఎస్ వ్యవహారం తెరపైకి రావడం ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని టెన్షన్ నెలకొంది.
Also Read: Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి