Ravela resign: ఏపీ బీజేపీకి షాక్..రావెల కిషోర్‌బాబు రాజీనామా..!

Ravela resign: ఏపీలో బీజేపీకి షాక్‌ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రావెల కిషోర్‌ బాబు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు పంపారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీని వీడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 16, 2022, 02:04 PM IST
  • ఏపీలో బీజేపీకి షాక్‌
  • రావెల కిషోర్‌ బాబు రాజీనామా
  • సోము వీర్రాజుకు లేఖ పంపిన రావెల
Ravela resign: ఏపీ బీజేపీకి షాక్..రావెల కిషోర్‌బాబు రాజీనామా..!

Ravela resign: ఏపీలో బీజేపీకి షాక్‌ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రావెల కిషోర్‌ బాబు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు పంపారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీని వీడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావులేదన్నారు. ప్రధాని మోదీ అవినీతి రహిత, సుస్థిర పాలన నచ్చి బీజేపీలో చేరినట్లు తెలిపారు. 

దేశం మరింత అభివృద్ధి చెందేందుకు మోదీ పాలన అవసరమని లేఖలో పేర్కొన్నారు. తనకు పార్టీలో సముచిత స్థానం కల్పించారని..పార్టీ ఉపాధక్ష్యుడి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీకి రావెల రాజీనామా చేయడంతో ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోందన్న దానిపై చర్చ జరుగుతోంది. తిరిగి సొంత గూటికి చేరుతారా అన్న ప్రచారం జరుగుతోంది. రావెల వృతిరిత్యా ఉపాధ్యాయుడు. 

అనంతరం ఆయన రాజకీయాల్లో వచ్చారు. టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న రావెల..2014లో చంద్రబాబు మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. మంత్రిగా సేవలందించారు. ఐతే కుమారుడి అంశంపై రాజకీయ దుమారం రేగడంతో టీడీపీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఆ తర్వాత మంత్రి పదవిని సైతం కోల్పోయారు. 2019 ఎన్నికల సమయంలో జనసేనలోకి వెళ్లారు.  కొన్ని కారణాల వల్ల మళ్లీ బీజేపీ గూటికి చేరారు. 

రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని కమలనాథులు యోచిస్తున్న సమయంలో రావెల రాజీనామా చేయడం ఆ పార్టీకి షాక్‌ తగిలినట్లు అయ్యింది. ఎవరూ పార్టీని వీడినా ఎలాంటి నష్టం ఉండబోదని బీజేపీ(BJP) నేతలు అంటున్నారు. తమ టార్గెట్ అంతా 2024 ఎన్నికలేనని చెబుతున్నారు. ఆ దిశగా ముందుకు వెళ్తున్నామంటున్నారు.

Alsro read:BJP Strategy: దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్..రాష్ట్రపతి ఆయనేనా..?

Alsro read:Telangana CM Kcr: తెలంగాణ సీఎం కేసీఆర్ మౌనం అందుకేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News