Gade Venkata Reddy: భార్య నగలు తాకట్టు పెట్టా.. 70 ఎకరాలు అమ్ముకున్నా.. వైసీపీ జడ్పీటీసీ ఆవేదన

Bellamkonda ZPTC: వైసీపీ కోసం 70 ఎకరాల పొలం అమ్ముకున్నానని అధికార పార్టీకి చెందిన జడ్పీటీసీ వాపోయారు. యాత్ర సినిమా కోసం తన భార్య నగలు తాకట్టుపెట్టి సినిమా హాలు అద్దెకు తీసుకుని ఆడించానని చెప్పారు. తీరా ప్రజా సమస్యలు పరిష్కరిద్దామనంటే ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.    

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2023, 07:51 AM IST
  • యాత్ర సినిమా కోసం భార్య నగలు తాకట్టు పెట్టా
  • వైసీపీ బలోపేతానికి 70 ఎకరాలను అమ్ముకున్నా
  • బెల్లకొండ జడ్పీటీసీ ఆవేదన
Gade Venkata Reddy: భార్య నగలు తాకట్టు పెట్టా.. 70 ఎకరాలు అమ్ముకున్నా.. వైసీపీ జడ్పీటీసీ ఆవేదన

Bellamkonda ZPTC: గత ఎన్నికలకు ముందు వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఎంతో మంది నాయకులు స్వచ్ఛందంగా తమ సొంత డబ్బులు ఖర్చు చేశారు. పార్టీని అధికారంలో వస్తే.. తమకు ఎంతో కొంత ప్రతీఫలం ఉంటుందని వారందరూ ఆశించారు. అయితే ఇప్పుడు ఆ నేతలంతా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కష్టపడి వైసీపీని అధికారంలోకి తీసుకువస్తే.. తమను కనీసం పట్టించుకోవడం లేదని దిగువ శ్రేణి నాయకులంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే మరోదారి చూసుకోవాల్సిందేంటూ కార్యకర్తలతో చెప్పుకుంటున్నారట.

ఇక తాజాగా ఏకంగా ఓ జడ్పీటీసీ కూడా మీడియా ముందుకు వచ్చి తన గోడును వెల్లబోసుకున్నారు. పల్నాడు జిల్లా బెల్లంకొండ వైఎస్సార్సీపీ జడ్పీటీసీ గాదె వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీని బలోపేతం చేసేందుకు తనకు ఉన్న 120 ఎకరాల్లో 70 ఎకరాలు అమ్ముకున్నానని చెప్పారు. 
జడ్పీటీసీ సభ్యుడిగా గెలిచినా తన కనీస గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

'ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీపై అభిమానంతో నా భార్య బంగారం తాకట్టు పెట్టి యాత్ర మూవీ కోసం సినిమా హాలు తీసుకున్నా. ఆ సినిమా ప్రదర్శన కోసం రూ.లక్షలు ఖర్చు పెట్టా. అదేవిధంగా ఎన్నికల సమయంలో వైసీపీ గెలుపు కోసం రూ.కోటిపైగానే ఖర్చు పెట్టా. అయితే జడ్పీటీసీగా గెలిచినా నాకు కనీస గౌరవం దక్కడం లేదు.

ఇక్క ఎంపీపీ చెన్నపురెడ్డి పద్మ, ఆమె కుటుంబ సభ్యులదే నడుస్తోంది. ప్రజా సమస్యలు పరిష్కరిద్దామంటే సహకరించడం లేదు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. పార్టీలో ఉంటే ఉండు.. లేకుంటే వెళ్లిపోమని చెబుతున్నారు. నన్ను నమ్ముకుని గెలిపించిన ప్రజల సమస్యలు నేను ఎలా పరిష్కరించాలి..? వైసీపీ పార్టీ కోసం ఎంతో డబ్బు ఖర్చు చేసి నష్టపోయా. ఇప్పుడు కుటుంబంతో ఆత్మహత్య చేసుకోవడం తప్ప నాకు మరో గత్యంతరం లేదు..' అంటూ జడ్పీటీసీ గాదె వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఆయన జడ్పీటీసీగా గెలవకముందే టీడీపీలో చేరాలని అనుకున్నారు. నామినేషన్లు వేసిన తరువాత కోవిడ్ ప్రభావం కారణంగా ఎన్నికలు ఆలస్యమయ్యాయి. ఈ గ్యాప్‌లో ఎమ్మెల్ నంబూరు శంకరరావు తీరు ఆయనకు నచ్చకలేదు. దీంతో జడ్పీటీసీ అభ్యర్థిత్వం ఉపసంహరించుకుని.. తెలుగుదేశ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. అయితే వై‌సీపీ నేతలు ఆయనకు నచ్చజెప్పి.. పోటీ చేసేలా ఒప్పించారు. అయితే జడ్పీటీసీగా గెలిచినా.. తనకు గౌరవం దక్కడం లేదని వెంకటరెడ్డి చెబుతున్నారు. 

Also Read: Ind Vs SL: ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ రెడీ.. నేడే లంకేయులతో సమరం  

Also Read: Navodaya Notification: నవోదయ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. ఆ రోజే లాస్ట్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News