Asani Cyclone Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన అసనీ తుపాను ప్రభావం ఏపీలో స్పష్టంగా కన్పిస్తోంది. తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు, విశాఖలో ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. తీర ప్రాంతాల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉందని తెలుస్తోంది.
అసనీ తుపాను ప్రభావం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, మరి కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో విశాఖపట్నం జిల్లాలో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఫలితంగా చెట్లు నేలకొరుగుతున్నాయి. కేవలం ఉత్తరాంధ్రనే కాకుండా రాయలసీమ ప్రాంతంలో అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో కూడా బలమైన ఈదురుగాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి.
కొన్ని ప్రాంతాల్లో రాత్రి కూడా గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. బలమైన ఈదురుగాలుల కారణంగా విశాఖపట్నలో భారీ చెట్లు , విద్యుత్ స్థంభాలు పడిపోయాయి. ఉభయ గోదావరి జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ప్రారంభమయ్యాయి. అసని తుపాను కారణంగా విశాఖ నుంచి నడిచే 23 ఇండిగో విమాన సర్వీసుల్ని రద్దు చేశారు. మరోవైపు ఢిల్లీ నుంచి విశాఖపట్నం, బెంగళూరు నుంచి విశాఖపట్నం వెళ్లే ఎయిర్ ఏషియా విమానాలు కూడా రద్దయ్యాయి. ముంబై-రాయ్‌పూర్- విశాఖ, ఢిల్లీ- విశాఖపట్నం ఎయిర్ ఇండియా విమానాలు కూడా రద్దయ్యాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook