Asani Cyclone Effect: అసని తుపాను తీవ్ర తుపానుగా మారనుందని ఐఎండీ హెచ్చరించింది. తుపాను ఏపీను ఢీ కొట్టనుందనే హెచ్చరికల నేపధ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఏపీలో విమాన సర్వీసులపై ఆ ప్రభావం పడింది.
అసని తుపాను తీవ్ర తుపానుగా మారి ఎల్లుండ అంటే బుధవారం నాడు విశాఖపట్నం- విజయనగరం మధ్య తీరం దాటనుందని తెలుస్తోంది. అసని తుపాను ప్రభావం ఉత్తరాంధ్రపై అధికంగా ఉండనుంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వ యంత్రాంగం తుపానును ఎదుర్కొనేందుకు సన్నద్ధమైంది. అసని తుపాను ప్రభావం విశాఖపట్నం, ఉప్పాడ తీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. భారీగా అలలు ఎగసిపడుతున్నాయి. ఉప్పాడ తీరంలోని గ్రామాల్లో ఇళ్లు కోతకు గురవుతున్నాయి. బలమైన ఈదురుగాలుల కారణంగా కెరటాలు ఎగిరిపడుతున్నాయి. కాకినాడ్ బీచ్ రోడ్‌పై కెరటాలు పైకి వస్తున్నాయి.
ఇక అసని తుపాను ప్రభావంతో విశాఖపట్నంలో పలు విమానాలు వెనుదిరిగాయి. విశాఖలో ఏర్పడిన ప్రతికూల వాతావరణంతో పలు విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్, ముంబై, చెన్నై, విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాల్లో ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. కర్నూలు, బెంగళూరు, హైదరాబాద్ నుంచి విశాఖకు రావల్సిన విమానాలు వెనుదిరిగాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook