Special Buses: సంక్రాంతికి గుడ్ న్యూస్, ఈ నగరాలకు ఏపీఎస్సార్టీసీ ప్రత్యేక బస్సులు

Special Buses: తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేస్తోంది. అప్పుడే ఏపీలో రైళ్లు  ఫుల్ అయ్యాయి. ఇక బస్సుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ క్రమంలో ఏపీఎస్సార్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. ఆ వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 1, 2025, 03:45 PM IST
 Special Buses: సంక్రాంతికి గుడ్ న్యూస్, ఈ నగరాలకు ఏపీఎస్సార్టీసీ ప్రత్యేక బస్సులు

Special Buses: సంక్రాంతి వేళ ప్రయాణీకులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఏపీఎస్సార్టీసీ ప్రత్యేక సర్వీసులు ప్రారంభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 1000 స్పెషల్ బస్సులు నడపనుంది. అంతేకాదు...ముందస్తు రిజర్వేషన్‌పై 10 శాతం రిజర్వేషన్ కూడా అందించనుంది. ఏయే నగరాలకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయో తెలుసుకుందాం.

సంక్రాంతి వచ్చిందంటే చాలు ఏపీలోని పలు ప్రాంతాలకు ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాలు బిజీ అయిపోతుంటాయి. ముఖ్యంగా బస్సులు, రైళ్లు ఫుల్ అయిపోతాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. సంక్రాంతి ఇంకా పదిరోజులుండగానే టికెట్లు ఫుల్లయ్యాయి. విశాఖపట్నం నుంచి రాజమండ్రి నుంచి విజయవాడ మధ్యలో రిజర్వేషన్ అనేది లేదు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాల నుంచి ఏపీకు రిజర్వేషన్ లేదు. బస్సులు కూడా ఫుల్ అవుతున్నాయి. ప్రయాణీకుల సౌకర్యార్ధం ఏపీఎస్సార్టీసీ సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు 1000 ప్రత్యేక బస్సులు నడపనుంది. సంక్రాంతికి 10 శాతం రాయితీ కూడా అందించనుంది. 

సంక్రాంతి అనగానే వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగం, ఉపాధి, చదువు నిమిత్తం వెళ్లినవారంతా తిరిగి సొంతూర్లకు వస్తుంటారు. అందుకే రైళ్లు, బస్సులు ఖాళీగా ఉండవు. రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు రాష్ట్రాల్నించి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, అనంతపురం ప్రాంతాల్నించి రాకపోకలు అధికంగా ఉంటాయి. జనవరి 8,9 తేదీల నుంచి ఏపీఎస్సార్టీసీ ఏకంగా 1000 బస్సులు నడపనుంది. అదగే రాను పోనూ ముందే రిజర్వేషన్ చేయించుకుంటే 10 శాతం రాయితీ అందించనుంది. 

వచ్చే ఆదివారం నుంచి ఏపీలో 1000 ప్రత్యేక బస్సులు తిరగనున్నాయి. ఇందులో ఇంద్ర, సూపర్ డీలక్స్, గరుడ, అమరావతి, డీలక్స్ బస్సులున్నాయి. ఏసీ, నాన్ ఏసీ కేటగరీల్లో బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. 

Also read: DA Announcement: ఉద్యోగులకు సంక్రాంతి కానుక, రెండు డీఏల ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News