Margadarsi Case: శైలజా కిరణ్‌కు 160 సీఆర్పీసీ నోటీసులు, అరెస్టు చేయనున్నారా

Margadasri Case: మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసులో ఏపీ సీఐడీ దర్యాప్తు వేగవంతమౌతోంది. నిబంధనలు ఉల్లంఘించిందనే ఆరోపణలతో ఇప్పటికే సీఐడీ పలు కేసులు నమోదు చేసింది. ఇప్పుడు తాజాగా ఆ సంస్థ ఎండీ శైలజా కిరణ్‌ను విచారణకు రావల్సిందిగా నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 28, 2023, 12:25 PM IST
Margadarsi Case: శైలజా కిరణ్‌కు 160 సీఆర్పీసీ నోటీసులు, అరెస్టు చేయనున్నారా

Margadasri Case: మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలు, నిధుల మళ్లింపు కేసులో ఏపీ సీఐడీ విచారణ ముమ్మరం చేసింది. సంస్థ ఎండీ శైలజా కిరణ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. కేసు నుంచి తప్పించుకోకుండా సీఐడీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పగడ్బందీగా కేసులు నమోదు చేస్తోంది. 

ఏపీలోని మార్గదర్శి సంస్థలపై ఇటీవల కొద్దికాలంగా సీఐడీ దాడులు నిర్వహించింది. దాడుల అనంతరం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో అక్రమాలు జరిగాయని, నిధుల మళ్లింపు చోటుచేసుకుందని సీఐడీ గుర్తించింది. దాంతో ఐపీసీ సెక్షన్లు 420, 409, 120-బి, 477 రెడ్ విత్ 34, ఇతర సెక్షన్ల కింద ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ2గా మార్గదర్శి ఛైర్మన్ చెరుకూరి రామోజీరావును, ఏ2గా ఆయన కోడలు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌లతో పాటు కొన్ని శాఖల మేనేజర్ల పేర్లు చేర్చింది. రాష్ట్రంలో విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, నర్శరావుపేట, గుంటూరు, అనంతపురం శాఖల్లో నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. 

ఇండివిడ్యువల్ గ్రూపులకు సంబంధించిన ఫారం 21ను మార్గదర్శి సంస్థ సమర్పించలేదని, బ్యాలెన్స్ షీట్లను కూడా అందించలేదని సీఐడీ గమనించింది. మూడు నెలల్నించి మార్గదర్శికి చెందిన కొన్ని గ్రూపుల కార్యకలాపాలు నిలిపివేశారని తెలుస్తోంది. 

ఇప్పుడు తాజాగా విచారణకు హాజరుకావల్సిందిగా ఏపీసీఐడీ ఏ2 శైలజా కిరణ్‌కు నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం ఆమె నివాసంలోనే విచారణకు హాజరుకావాలని కోరింది. ఇందుకు నాలుగు తేదీలు ఇచ్చిన సీఐడీ, ఏదో ఒక రోజు విచారణకు హాజరు కావాలని తెలిపింది. మార్చ్ 29, 31 తేదీల్లో లేదా ఏప్రిల్ 3,6 తేదీల్లో అందుబాటులో ఉండాలని, విచారణకు ఇంట్లో లేదా ఆఫీసులో ఉంటే చాలని పేర్కొంది. విచారణ అనంతరం శైలజా కిరణ్‌ను అరెస్టు చేసే అవకాశాలున్నాయనే వాదన విన్పిస్తోంది. 

Also read: Viveka Murder Case: వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం, దర్యాప్తు అధికారి మార్పుకు ఆదేశాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News