AP Weather Report: నిప్పుల కుప్పంటిలా ఆంధ్రప్రదేశ్.. నేడు, రేపు కూడా తీవ్ర వడగాలులు!

Andhra Pradesh Weather Report: ఏపీ అగ్నిగుండాన్ని తలపిస్తోంది. మెున్నటితో పోలిస్తే గురువారం ఎండ తీవ్రత మరింత పెరిగింది. ఎన్నడూ లేని విధంగా 210 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచాయి..

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 18, 2023, 08:05 PM IST
AP Weather Report: నిప్పుల కుప్పంటిలా ఆంధ్రప్రదేశ్.. నేడు, రేపు కూడా తీవ్ర వడగాలులు!

AP Weather Report: సూర్యుడి ప్రతాపంతో ఏపీ అగ్నిగుండంలా మారింది. భానుడు భగభగలకు జనాలు అల్లాడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగటి పూట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైనే నమోదవుతున్నాయి.

రోజురోజూకు ఎండతీవ్రత పెరుగుతుంది. గురువారం అయితే ఉష్ణగుండాన్ని తలపించిందనే చెప్పాలి. ఎప్పుడూ లేని విధంగా 210 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచాయి. అంటే రాష్ట్రంలోని 31% మండలాలు నిప్పుల గుండాన్ని తలపించాయి. మరో 220 మండలాల్లో వడగాలుల తీవ్రత పెరిగింది. మొత్తంగా చూస్తే 64% పైగా మండలాల్లోని ప్రజలు ఈ వేడికి ఉక్కిరిబిక్కిరియ్యారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ, రేపు కూడా ఈ వేడిగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. 268 మండలాల్లో తీవ్రంగానూ, 235 మండలాల్లో అధిక స్థాయిలోనూ వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

నిన్న అనకాపల్లి జిల్లాలోని 23 మండలాల్లో,  విశాఖపట్నం జిల్లాలోని మొత్తం 8 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచాయి. గురువారం ఏపీలోని ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.5, ప్రకాశం జిల్లా కురిచేడులో 44.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే నర్సాపురంలో 7.9, విశాఖపట్నం, బాపట్లలో 7.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Also Read: Biperjoy Effect: బిపర్‌జోయ్ విధ్వంసం, గుజరాత్‌లో భారీ వర్షాలు, భీకరమైన గాలులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News