Virology Laboratory: ఏపీ ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. వైద్యరంగంలో మౌళిక సదుపాయాలు మెరుగుపర్చుకునే చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే సీసీఎంబీ స్థాయిలో అతిపెద్ద ల్యాబొరేటరీ ఏర్పాటుకు సిద్ధమైంది.
ఏపీలో గత కొద్దికాలంగా వైద్యరంగంలో సమూల మార్పులకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా కరోనా సంక్షోభం(Corona Crisis)నేపధ్యంలో వైద్యరంగంలో మౌళిక సదుపాయాల్ని మెరుగుపర్చుకోవల్చిన అవసరాన్ని గుర్తించింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోనే అతిపెద్ద ల్యాబొరేటరీని(Ap to build major laboratory)ఏర్పాటు చేయదలిచింది. పూణే వైరాలజీ ల్యాబొరేటరీ, హైదరాబాద్ సీసీఎంబీ(CCMB) స్థాయిలో భారీ ల్యాబ్‌ను విజయవాడ సమీపంలో ఏర్పాటు చేయబోతోంది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అధికారులు స్థల సేకరణకు రాగానే వెంటనే స్పందించిన ప్రభుత్వం..విజయవాడ విమానాశ్రయం వద్ద 3 ఎకరాల స్థలాన్ని మంజూరు చేసింది.
ఇప్పటి వరకూ క్లిష్టమైన నమూనాలను పరీక్ష కోసం పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(National Institute of Virology)లేదా హైదరాబాద్ సీసీఎంబీకు పంపించేవారు. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. ఈ రెండు ల్యాబొరేటరీల స్థాయిలో ఏపీలో సరికొత్త ల్యాబొరేటరీ రానుంది. ల్యాబొరేటరీ నిర్మాణానికి 15 నుంచి 20 కోట్ల వరకూ ఖర్చవుతుందని అంచనా. రెండేళ్లల ఈ ల్యాబొరేటరీను అందుబాటులో తీసుకురానున్నారు. ల్యాబొరేటరీ పూర్తి స్థాయిలో నిర్మాణం అనంతరం 3 వందలమంది సిబ్బంది పనిచేయనున్నారు. ఇప్పటికే అతి తక్కువ సమయంలో 14 వైరాలజీ ల్యాబొరేటరీలు ఏర్పాటు చేసిన ఘనత ఏపీ ప్రభుత్వానికుంది.
ల్యాబొరేటరీ ఉపయోగాలు
అన్ని రకాల వైరస్, బ్యాక్టీరియా పరీక్షలు, కీటకాలు, ఎల్లో ఫీవర్ పరీక్షలు చేయవచ్చు
ఇప్పటి వరకూ రాష్ట్రంలో జినోమిక్స్ సీక్వెన్సీ ల్యాబ్ లేదు. ఇది తొలి ల్యాబొరేటరీ కానుంది
వింత వ్యాధులు తలెత్తినప్పుడు అక్కడికక్కడే పరీక్షలు చేసి చర్యలు తీసుకోవచ్చు
నిర్మాణ వ్యయం, మానవ వనరులు కేంద్రానివి కాగా..స్థలం మాత్రం ఏపీ ప్రభుత్వానిది
Also read: Facebook, Whatsapp, Instagram Services Restored: 7 గంటల అనంతరం రీస్టోర్ అయిన సేవలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook