AP TET Results 2024: ఏపీ టెట్ ఫైనల్ 'కీ' విడుదల.. ఫలితాలు చెక్ చేసుకోండి ఇలా...

AP TET 2024 Result: ఏపీ టెట్ ఫైనల్ కీ అందుబాటులోకి వచ్చింది. https://aptet.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా మీరు ఫైనల్ కీ, స్కోరు కార్డు వివరాలను తెలుసుకోవచ్చు. టెట్ పరీక్షలు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 09వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే.   

Written by - Samala Srinivas | Last Updated : Mar 15, 2024, 07:00 AM IST
AP TET Results 2024: ఏపీ టెట్ ఫైనల్ 'కీ' విడుదల.. ఫలితాలు చెక్ చేసుకోండి ఇలా...

AP TET 2024 Answer Key Released: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024 పరీక్షకు సంబంధించిన ఫైనల్ కీను విడుదల చేసింది ఏపీ విద్యాశాఖ. మార్చి 13నే ఎస్‌జీటీ పరీక్షకు సంబంధించిన ఫైనల్ కీను రిలీజ్ చేయాల్సి ఉండగా... మార్చి 14 రాత్రి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెళితే అక్కడ సబ్జె్క్టులవారీగా ఆన్సర్ కీ, రెస్సాన్స్ షీట్లను అందుబాటులో ఉంచింది. 

ఏపీ టెట్-2024 నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 7న విడుదల చేసింది జగన్ సర్కార్. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించింది. అదే నెల 23 నుంచి హాల్‌‌టికెట్లు అందుబాటులో ఉంచింది. ఈ పరీక్షలు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 09వ తేదీ వరకు జరిపారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. 

ఫైనల్ కీ, స్కోరు కార్డు డౌన్ లోడ్ చేసుకోండి ఇలా..
==>ముందుగా అభ్యర్థులు ఏపీ టెట్ వెబ్ సైట్ https://aptet.apcfss.in/ లోకి వెళ్లాలి.
==>అక్కడ మీకు హోంపేజీలో Final keys అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని పై క్లిక్ చేయాలి. 
==>ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో నిర్వహించిన టెట్ ఎగ్జామ్స్ ఫైనల్ కీ లిస్ట్ కనిపిస్తుంది.
==>మీరు ఏ సబ్జెక్ట్ అయితే రాశారో ఆ సంబంధింత సబ్జెక్ట్ పేరు పక్కన Click Here అనే ఆప్షన్ ఉంటుంది, దానిపై మీరు క్లిక్ చేయాలి.  
==>ఆ తర్వాత డిస్ ప్లే పై మీ సబ్జెక్ట్ యెుక్క ఫైనల్ కీ కనిపిస్తుంది. 
==>ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మీరు ఫైనల్ కీ కాపీని పొందవచ్చు.
** అభ్యర్థులు అదే వెబ్ సైట్ లోకి వెళ్లి హోంపేజీలో కనిపించే AP TET Feb-2024 Results ఆప్షన్ పై క్లిక్ చేసి లాగిన్ వివరాలు ఎంటర్ చేస్తే మీ టెట్ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.ఈ టెట్ స్కోర్ కార్డును డౌన్ లోడ్ చేసుకుని జాగ్రత్తగా మీ వద్ద ఉంచుకోండి. 

Also Read: School Holidays 2024: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ నెల 18 నుంచి స్కూళ్లకు సెలవులు..

Also Read: Ram Gopal Varma: పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్‌పై ఆర్జీవీ పోటీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News