AP SSC Results 2023: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. మొత్తం 6 లక్షలమంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. 72.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా అత్యధికంగా బాలికలు 75.38 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
ఏపీ ఎస్ఎస్సి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బాలుర కంటే బాలికలు అత్యధికంగా ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలకు 99.34 శాతం మంది హాజరు కాగా 72.26 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణులు కాగా, బాలురు 69.27 శాతం మంది పాసయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 934 పాఠశాలల్లో 100 శాతం ఫలితాలు వస్తే..38 స్కూల్స్‌లో మాత్రం జీరో ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలో 87.47 శాతంతో పార్వతిపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 60.39 శాతం ఫలితాలతో నంద్యాల చివరి స్థానంలో ఉంది. రెసిడెన్షియల్ పాఠశాలలు 95.25 శాతం ఉత్తీర్ణత సాధించాయి. రాష్ట్రంలో మొత్తం 6.40 లక్షలమంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా 6,05,052 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఏప్రిల్ 3 నుంచి 18 వరకూ జరిగిన పరీక్షల ఫలితాల్ని రికార్డు స్థాయిలో కేవలం 18 రోజుల్లో విడుదల చేశారు. పరీక్ష ఫలితాలను
https://bse.ap.gov.in/ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధులకు సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2 నుంచి జూన్ 10 వరకూ జరగనున్నాయి. వీటికోసం మే 15లోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. మే 22వ తేదీన ఫైన్‌తో ఫీజు చెల్లించవచ్చు. ఇక మే 13 వరకూ రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేయవచ్చు.
Also read: AP SSC Results 2023: ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి, లింక్ వివరాలు ఇవీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook