AP Tenth Results Date and Time: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫలితాలు వచ్చేయడంతో ఇప్పుడు విద్యార్థులు టెన్త్ క్లాస్ రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే స్పాట్ వాల్యుయేషన్ పూర్తి కాగా.. ఈ నెల రెండో వారంలో ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మార్కుల టేబులేషన్, అప్‌లోడ్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముందుగా ప్రకటించినట్లు మే రెండో వారంలోనే రిజల్ట్స్ విడుదల చేస్తామని తెలిపారు. గత నెల 18న పదో తరగతి పరీక్షలు పూర్తవ్వగా.. దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు పూర్తయిన వెంటనే.. ఏప్రిల్ 19 నుంచి 26 వరకు స్పాట్ వాల్యుయేషన్ కూడా పూర్తి చేశారు. స్పాట్ వాల్యుయేషన్‌లో దాదాపు 35 వేల మంది ఉపాధ్యాయులు పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు.
పదో తరగతి ఫలితాలపై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మార్కుల అప్‌లోడ్ ప్రక్రియ పూర్తవ్వగానే.. ఫలితాల తేదీపై స్పష్టత రానుంది. మంత్రి బొత్స సత్యనారాయణ అనుమతితో మే 10వ తేదీ తరువాత ఫలితాలు విడుదల చేసే ఛాన్స్ ఉందని అధికారులు అంటున్నారు. ఫలితాల సమయం దగ్గర పడుతుండడంతో విద్యార్థులతోపాటు తల్లిదండ్రుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.
ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
==> bse.ap.gov.in, manabadi.co.in వెబ్‌సైట్లలో పదో తరగతి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
==> హోమ్ పేజీలో అందుబాటులో ఏపీ టెన్త్ రిజల్ట్స్ లింక్‌పై క్లిక్ చేయండి.
==> హాల్ టికెట్ వివరాలను ఎంటర్ చేసి.. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
==> తరువాత రిజల్ట్స్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.
==> ఫలితాలను ప్రింట్ తీసుకుని.. భవిష్యత్ అవసరాల కోసం భద్రంగా దాచుకోండి.
మరోవైపు తెలంగాణలో ప్రస్తుతం స్పాట్ వాల్యుయేషన్ కొనసాగుతోంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 19వ వరకు ఎగ్జామ్స్ జరిగాయి. మొత్తం 18 కేంద్రాల్లో మూల్యాంకనం జరుగుతోంది. మూల్యాంకనం పూర్తవ్వగానే.. అప్‌లోడ్ ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. మే నెల చివరి నాటిని ఫలితాలు వచ్చే అవకాశంఉందని విద్యా నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: KKR Squad Update: కేకేఆర్ జట్టులోకి హార్డ్ హిట్టర్ ఎంట్రీ.. ఇక బౌలర్లకు దబిడి దిబిడే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook