AP: రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు

కరోనా కట్టడిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు నుంచీ పగడ్బందీ వ్యూహంతో ముందుకుపోతోంది. కేసులు ఎక్కువవుతున్నా సరే...కరోనా నిర్ధారణ పరీక్షల్ని మాత్రం తగ్గించడం లేదు. రికార్డు స్థాయిలో పరీక్షల్ని నిర్వహిస్తోంది.

Last Updated : Aug 4, 2020, 10:15 PM IST
AP: రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు

కరోనా కట్టడిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు నుంచీ పగడ్బందీ వ్యూహంతో ముందుకుపోతోంది. కేసులు ఎక్కువవుతున్నా సరే...కరోనా నిర్ధారణ పరీక్షల్ని మాత్రం తగ్గించడం లేదు. రికార్డు స్థాయిలో పరీక్షల్ని నిర్వహిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో మరో 9 వేల 747 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడిలో భాగంగా ట్రేస్, టెస్ట్, ట్రీట్ మెంట్ ను పక్కాగా పాటిస్తోంది. ముందు గుర్తించడం, పరీక్షలు చేయడం, చికిత్స అందించడం ప్రధానంగా చేస్తోంది. అందుకే ముందు నుంచీ కరోనా నిర్ధారణ పరీక్షల్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. గత 15 రోజుల్నించి రోజుకు 50-70 వేల పరీక్షలు చేస్తూ ముందుకు సాగుతోంది. గత 24 గంటల్లో ఏపీలో 64 వేల 147 పరీక్షలు చేశారు. దీంతో ఇప్పటివరకూ చేసిన పరీక్షల సంఖ్య 21 లక్షల 75 వేల 70కు చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 1 లక్షా 76 వేల 333కు చేరుకోగా...కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు 95 వేల 625 ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 79 వేల 104 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 6 వేల 953 మంది డిశ్చార్జ్ అయ్యారు. అటు తాజాగా 67 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య రాష్ట్రంలో 1604గా ఉంది. Also read: AP: సెప్టెంబర్ 5 నుంచి స్కూల్స్ పారంభం

Trending News