AP Panchayat Elections 2021: పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై AP SEC చర్యలు, నివేదిక కోసం ఆదేశాలు

AP SEC Action On Consensus In Panchayat Elections 2021: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల పోరు రోజురోజుకూ పెరిగిపోతోంది. అధికార, విపక్షాలతో పాటు ఏపీ ఎలక్షన్ కమిషన్ సైతం బరిలో దిగినట్లుగా పరిస్థితి తయారైంది. ఈ వాచ్ యాప్, ఈ నేత్రం యాప్ సమస్యలు స్వీకరించనున్నాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 5, 2021, 01:30 PM IST
  • ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై తొలి నుంచి ఎలక్షన్ కమిషన్ విరుద్ధం
  • ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లుతుందన్న ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్
  • అత్యధిక పంచాయతీలు ఏకగ్రీవం అయిన జిల్లాలపై నిమ్మగడ్డ దృష్టి
AP Panchayat Elections 2021: పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై AP SEC చర్యలు, నివేదిక కోసం ఆదేశాలు

AP SEC Action On Consensus In Panchayat Elections 2021: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై తొలి నుంచి ఎలక్షన్ కమిషన్ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అత్యధిక స్థానాలు ఏకగ్రీవం దిశగా వెళ్తున్నాయంటే ప్రజాస్వామ్యంపై, ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లుతుందని ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో అత్యధిక పంచాయతీలు ఏకగ్రీవం అయిన జిల్లాలపై నిమ్మగడ్డ దృష్టి సారించారు.

 

చిత్తూరు జిల్లాలో 112, గుంటూరు జిల్లాలో 67 పంచాయతీలు ఏకగ్రీవం కావడంపై నివేదిక సమర్పించాలని ఈ రెండు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. అయితే సమగ్ర నివేదిక పరిశీలించిన తర్వాతే ఏకగ్రీవాలపై ప్రకటన చేయనున్నట్లు ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్(AP SEC Nimmagadda Ramesh Kumar) తెలిపారు. పంచాయతీలు ఏకగ్రీవం అయిన విషయాలను ప్రకటించవద్దని అధికారులకు ఎన్నికల కమిషనర్ సూచించారు.

Also Read: Ap Panchayat Elections 2021: ముగిసిన తొలిదశ నామినేషన్ల పర్వం, ఏకగ్రీవమైన పంచాయితీలివే

 

గుంటూరు జిల్లాలో AP Panchayat Elections 2021లో 337 సర్పంచి స్థానాలకుగారూ 67 స్థానాల్లో ఒకే ఒక నామినేషన్ రావడంతో ఏకగ్రీవం అయ్యాయి. 67 స్థానాల్లో 63 అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) సానుభూతిపరులు ఏకగ్రీవం అయ్యారు. రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు, మరో రెండు చోట్ల ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ(TDP) సానుభూతిపరులు ఉన్నారు. సీట్ల పంపకంతో పాటు, అధికార మార్పిడి లాంటి అంశాలతో ప్రలోభపెట్టి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవాలుగా మారుతున్నాయని ఏపీ ఎలక్షన్ కమిషన్ చర్యలకు సిద్ధమైంది. 

Also Read: Ap Panchayat Elections 2021: తొలి విడత పంచాయితీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం సమాప్తం

 

కాగా, చిత్తూరు జిల్లాలోనూ 112 స్థానాలు ఏకగ్రీవంకాగా, అందులో పెద్ద మొత్తంలో 90కి పైగా స్థానాల్లో వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులు, టీడీపీ సానుభూతిపరులు 9 మంది, ఇతర స్వతంత్ర అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. అయితే ఏకగ్రీవాలపై నివేదికను పరిశీలించేంతవరకు ఎలాంటి ప్రకటన చేయకూడదని ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు.

Also Read: Atchannaidu Arrest: ఏపీ TDP అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్, Chandrababu ఆగ్రహం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News