Ap: లక్షకు చేరువలో కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. పరీక్షలు పెరిగే కొద్దీ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో 7 న్నర వేల కేసులతో మొత్తం కేసుల సంఖ్య లక్షకు చేరువలో ఉంది.

Last Updated : Jul 26, 2020, 08:39 PM IST
Ap: లక్షకు చేరువలో కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. పరీక్షలు పెరిగే కొద్దీ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో 7 న్నర వేల కేసులతో మొత్తం కేసుల సంఖ్య లక్షకు చేరువలో ఉంది.

ఏపీలో రోజురోజుకూ కరోనా నిర్ధారణ పరీక్షలు పెరుగుతున్నాయి. రోజుకు దాదాపు 50 వేల పరీక్షలు చేస్తున్నారు. దాంతో కేసుల సంఖ్య కూాడా భారీగానే పెరుగుతోంది. కొత్తగా అంటే గత 24 గంటల్లో 7 వేల 627 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 96 వేల 298కు చేరుకుంది. గత 24 గంటల్లో 47 వేల 645 శాంపిల్స్ ను పరీక్షించగా...7 వేల 627 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మెడికల్ బుల్లెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 3 వేల 41 మంది డిశ్చార్జ్ అవడంతో ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 46 వేల 301కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 48 వేల 956 యాక్టివ్ కేసులున్నాయి. అటు మరణాల సంఖ్య 1 వేయి 41 గా నమోదైంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 16 లక్షల 43 వేల 39 పరీక్షలు చేశారు. Also read: Sonu Sood: కాడెద్దులుగా రైతు కూతుళ్లు.. చలించిపోయిన సోనూ సూద్

Trending News