Ambati Rayudu: వైసీపీకి బిగ్ షాక్... మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గుడ్ బై..

Ambati Rayudu: ఇటీవలే వైసీపీలో చేరిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తాజాగా పార్టీ  నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2024, 12:06 PM IST
Ambati Rayudu: వైసీపీకి బిగ్ షాక్... మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గుడ్ బై..

Ambati Rayudu quit From YCP : ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా అధికారి పార్టీ వైసీపీకి(YSRCP) గట్టి షాక్ తగిలింది. ఇటీవల వైసీపీలో  చేరిన స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు.. తాజాగా పార్టీ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 'వైసీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నా... కొంత కాలం పాలిటిక్స్ కు దూరంగా ఉండాలనుకుంటున్నా.. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా' అని అంబటి తెలిపాడు. సడన్ గా రాయుడు డెసిషన్ మార్చుకోవడంతో అధికార పార్టీ నేతలు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. 

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత రాయుడు.. గత నెల 28న సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే పార్టీలో చేరి పది రోజులు కూడా కాకుండానే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం ఏపీలో హాట్ టాఫిక్ గా మారింది. గత కొంతకాలంగా రాయుడు పొలిటికల్ కెరీర్ గురించి జోరుగా చర్చ జరుగుతోంది. దానికి అనుగుణంగా అంబటి కూడా రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. ఇదే క్రమంలో వైసీపీ అనుకూలంగా మాట్లాడూతూ.. జగన్ పాలనపై ప్రశంసలు వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే వైసీపీ కండువా కప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అంబటి పోటీ చేయడం ఖాయమనుకున్న తరుణంలో.. పార్టీని వీడితున్నట్లు సడన్ గా షాకిచ్చాడు రాయుడు. 

 

ఇదే కారణమా..!
రాయుడు గుంటూరు నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తామన్న హామీతోనే అంబటి వైసీపీలో చేరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నరసరావుపేట స్థానాన్ని బీసీలకు కేటాయించే యోచనలో ఉన్న జగన్.. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలుని గుంటూరు స్థానానికి మారాల్సిందిగా శుక్రవారం జగన్ ప్రతిపాదన చేశారు. దీనికి అంగీకరించిన శ్రీకృష్ణదేవరాయలు తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారట. తాజా పరిణామాల నేపథ్యంలో గుంటూరు టికెట్ ను ఆశించిన రాయుడు వైసీపీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు.

Also Read: Kesineni Nani: తమ్ముడితో రచ్చ అన్న సీటుకు ఎసరు.. కేశినేని నాని దారేటు..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News