Ap Panchayat Election results live updates: ఏపీ తొలి విడత పంచాయితీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకూ అందిన ఫలితాల ప్రకారం అధికారపార్టీ హవా కొనసాగుతోంది. ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) పంచాయితీ తొలి విడత ఎన్నికలు( First phast panchayat elections )ముగిశాయి. ఫలితాలు వెలువడేకొద్దీ అధికారపార్టీలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇవాళ అంటే ఫిబ్రవరి 9 సాయంత్రం 4 గంటలకు కౌటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 3 వేల 249 పంచాయితీ ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ( ysr congress party ) బలపర్చిన అభ్యర్ధులు 586 మంది విజయం సాధించగా..తెలుగుదేశం ( Telugu Desam )బలపర్చిన అభ్యర్ధులు 13 స్థానాల్లో గెలిచారు. జిల్లాల వారీగా గెలిచిన వివరాలివే..
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ మద్దతుదారులు 53 మంది గెలవగా..టీడీపీ 2 రెండు స్థానాల్లో గెలిచింది. విశాఖపట్నంలో వైసీపీ మద్దతుదారులు 44 మంది, తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ మద్దతుదారులు 30 మంది , ప్రకాశం జిల్లాలో వైసీపీ మద్దతుదారులు 39 మంది విజయం సాధించగా..తెలుగుదేశం పార్టీ ఇంకా ఖాతా తెరవలేదు. ఇక కృష్ణా జిల్లాలో వైసీపీ మద్దతుదారులు 25, టీడీపీ మద్దతుదారుడు 1 స్థానంలో, ఇతరులు ఒక స్థానంలో గెలిచారు. గుంటూరులో వైసీపీ మద్దతుదారులు 75 మంది గెలవగా..ఇతరులు ఇద్దరు గెలిచారు. నెల్లూరులో వైసీపీ మద్దతుదారులు 29, టీడీపీ ఒకరు విజయం సాధించారు. చిత్తూరులో వైసీపీ మద్దతుదారులు 117 మంది గెలిచారు. అనంతపురంలో వైసీపీ మద్దతుదారులు 16 మంది గెలవగా..టీడీపీ ఒక స్థానంలో విజయం సాధించింది. కడప జిల్లాలో వైసీపీ మద్దతుదారులు 51 మంది గెలవగా..కర్నూలులో వైసీపీ మద్దతుదారులు 57 మంది గెలిచారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 41 మంది వైసీపీ బలపర్చిన అభ్యర్ధులు విజయం సాధించారు.
Also read: Ys Sharmila meeting: అన్నాచెల్లెళ్ల మధ్య విబేధాలున్నాయా...షర్మిల సమావేశం దేనికి సంకేతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook