Tirumala: తిరుమల అధికారుల తీరు మరోసారి వివాదాస్పమైంది. భక్తుల ఆగ్రహానికి కారణమైంది. కొన్ని రోజులకు తిరుమలకు భక్తులు పోటెత్తున్నారు. వరుస సెలవులు కావడంతో వెంకన్న దర్శానికి గతంలో ఎప్పుడు లేనంతగా భక్తులు వస్తున్నారు. దీంతో శ్రీవారి సర్వ దర్శానానికి 40 గంటలకు పైగా సమయం పడుతోంది. శ్రీవారి దర్శనం కోసం గంటలకొట్టి క్యూలెన్లలో నిల్చుని భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే భక్తులు కష్టాలు పడుతున్నా పట్టించుకోని టీటీడీ అధికారులు వీఐపీల సేవలో తరిస్తున్నారు. ఇటీవలే శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి సిదిరి అప్పలరాజు.. వందలాది మంది అనుచరులతో శ్రీవారిని దర్శించుకోవడం వివాదాస్పదమైంది. ఈ ఘటన మరవకముందే టీటీడీ అధికారుల మరో నిర్వాకం బయటపడింది.
తాజాగా తిరుమలలో ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీ చరణ్ అనుచరులు హల్చల్ చేశారు. పదుల సంఖ్యలో మంత్రి అనుచరులకు దర్శన భాగ్యం కల్పించింది టిటిడి. దీనిపై ప్రశ్నించిన మీడియా ప్రతినిధుల పై మంత్రి అనుచరులు దౌర్జన్యానికి దిగారు. శ్రీవారి విఐపి దర్శనానికి మంత్రి ఉషశ్రీ చరణ్ తో పాటు 50 మందిని అనుమతించారు టిటిడి అధికారులు. శ్రీవారి దర్శనం కోసం 40 గంటల తరబడి వేచిన భక్తులను టిటిడి విస్మరిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. టీటీడీ తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వందలాది మందికి దర్శన భాగ్య కల్పించడంపై మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండానే వెనుదిరిగారు మంత్రి ఉషా శ్రీ చరణ్.
భక్తుల కష్టాలపై ప్రశ్నించిన మీడియాపై మంత్రి గన్‌మెన్లు దురుసుగా ప్రవర్తించారు. ఓ వీడియో జర్నలిస్టును నెట్టేశారు. ఏపీ మంత్రి నిర్వాకం తిరుమలలో కలకలం రేపుతోంది. వీఐపిలకి రెడ్ కార్పెట్ పరచడంపై టిటిడి పై మండిపడుతున్నారు భక్తులు ఇప్పటికే మూడు రోజులకు పైగా తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. అయినా ఇలా మంత్రి అనుచరులకు దొడ్డి దారిన దర్శన భాగ్యం కల్పించడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి.
Read Also: Srinivas Goud: మంత్రి గన్ ఫైర్ చేసినా డీజీపీ మౌనం? ఆ పోస్ట్ కోసమేనంటూ బీజేపీ ఫైర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి