Kodali Nani: నాడే చంద్రబాబును అంతం చేసి ఉండాల్సింది

Kodali Nani: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి పేరు వింటేనే చాలు..అంతెత్తున విరుచుకుపడే మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడే చంద్రబాబును అంతం చేసి ఉండాల్సిందన్నారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 18, 2021, 11:30 AM IST
Kodali Nani: నాడే చంద్రబాబును అంతం చేసి ఉండాల్సింది

Kodali Nani: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి పేరు వింటేనే చాలు..అంతెత్తున విరుచుకుపడే మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడే చంద్రబాబును అంతం చేసి ఉండాల్సిందన్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని(Chandrababu naidu) క్రమం తప్పకుండా విమర్శించే వ్యక్తి మంత్రి కొడాలి నాని మాత్రమే. సందర్భం ఉన్నా లేకపోయినా చంద్రబాబును ఓ ఆటాడుకుంటుంటారు. ఇప్పుడు మరోసారి చంద్రబాబు నాయుడిపై వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని.

నాడు ఎన్టీఆర్‌ను(NTR) అక్రమంగా పదవీచ్యుతుడిని చేసినప్పుడే చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించి..అంతమొందించి ఉండాల్సిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు అలా జరిగుంటే..నేడు గుంటూరు లాంటి ఘటనలు జరిగేవి కావన్నారు కొడాలి నాని(Kodali Nani). ఎస్సీ మహిళ శవాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు నాయుడు..శవ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు లోకేష్‌పై కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. జగనన్న విద్యాకానుక ప్రజల్లో వెళ్లకుండా అడ్డుకునేందుకు లోకేష్(Lokesh) కొత్త నాటకానికి తెరతీశారని కొడాలి నాని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల్ని అడ్డుకుంటున్న చంద్రబాబు, లోకేష్‌లకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. మహిళలపై దాడులకు అడ్డుకట్ట వేయాలనేదే తమ ప్రభుత్వం అభిమతమని గుర్తు చేశారు. అందుకే దిశ చట్టం(Disha Bill), యాప్ ప్రవేశపెట్టామన్నారు. గుంటూరు యువతిని హత్య చేసిన నిందితుడిని 12 గంటల్లోగా అరెస్టు చేశామన్నారు. 

Also read: Taliban Issue: తాలిబన్లపై ఉత్తరప్రదేశ్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News