AP Schools Reopen: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా మూతపడిన స్కూళ్లను తిరిగి తెరవనుంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) కారణంగా రాష్ట్రంలో స్కూళ్లు, కళాశాలలు మూతపడ్డాయి. కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు తగ్గుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో థియేటర్లను 50 శాతం ఆక్యుపెన్సీతో తెర్చుకునేందుకు అనుమతిచ్చిన ప్రభుత్వం..తాజాగా పెళ్లిళ్లలో గరిష్ట అనుమతిని కూడా 150 కు పెంచింది. ఇప్పుడు స్కూళ్లను తిరిగి తెరిచేందుకు నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 16వ తేదీ నుంచి రాష్ట్రంలో ఆఫ్‌లైన్‌లో పూర్తి స్థాయిలో పాఠశాలలు ప్రారంభం కానున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్(Adimulapu Suresh) తెలిపారు. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ అన్ని జాగ్రత్తలతో స్కూళ్లను ప్రారంభిస్తామన్నారు. అన్నితరగతులకు యధాతథంగా పాఠశాలల సమయం ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 95 శాతం టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తయిందని..మిగిలినవారికి కూడా వ్యాక్సిన్ వేయనున్నామని మంత్రి సురేష్ చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా ఆన్‌లైన్ తరగతులు జరగడం లేదని..ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతుల్ని నడపవద్దని ఆదేశించామన్నారు.
Also read: సోషల్ మీడియాలో రష్మిక టాప్, 20 మిలియన్ల ఫాలోవర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook