AP LAWCET 2020 Answer Key: ఏపీ లాసెట్‌ 2020 ‘కీ’ తప్పుల తడక

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (అనంతపురం) నిర్వహించిన లాసెట్‌ ప్రశ్నాపత్నం ఆన్సర్ కీ (AP LAWCET 2020 Answer Key) తప్పులతడకల మారింది. న్యాయవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం అక్టోబర్ 1న ఏపీ లాసెట్ 2020 (AP LAWCET 2020) నిర్వహించారు.

Last Updated : Oct 5, 2020, 08:53 AM IST
AP LAWCET 2020 Answer Key: ఏపీ లాసెట్‌ 2020 ‘కీ’ తప్పుల తడక

న్యాయవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం అక్టోబర్ 1న ఏపీ లాసెట్ 2020 (AP LAWCET 2020) నిర్వహించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (అనంతపురం) నిర్వహించిన లాసెట్‌ ప్రశ్నాపత్నం ఆన్సర్ కీ (AP LAWCET 2020 Answer Key) తప్పులతడకల మారింది. మూడేళ్ల లా కోర్సుకు సంబంధించి ప్రతి మూడు ప్రశ్నలకు రెండు సమాధానాలు తప్పులుగా ఇవ్వడంతో అభ్యర్థులు ఆశ్చర్యపోతున్నారు. ఎవరైనా ఆన్సర్ కీ ఇలా తయారా చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. లీగల్ ఆప్టిట్యూడ్ విభాగంలో 60 ప్రశ్రలకుగానూ 40 ప్రశ్నల సమాధానాలు తప్పుగా ఇచ్చారు.  Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
ప్రిలిమినరీ కీ

ఈ ఆన్సర్ కీ ని నిపుణులు తయారు చేయలేదని, ఎస్‌కేయూ ఈ విషయంలో ఉదాసీనత ప్రదర్శించిందని విమర్శలు వస్తున్నాయి. అవగాహన లేని వ్యక్తులతో కీ ప్రిపేర్ చేయించారని అర్ధమవుతోంది. గతంలో ఇలాంటి కీ ఎప్పుడూ చూడలేదని, దాదాపుగా ప్రతి సమాధానం తప్పుగా మాస్టర్ కీ లో ఎలా చూపించారో అర్థంకాక విద్యార్థులతో పాటు న్యాయశాస్త్ర నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్  

ఉదాహరణకు..
భారతదేశంలో వివాహ వయసు అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 కాగా, అన్సర్ కీ లో వివాహ అర్హత వయసు 21 అని ఇవ్వడం గమనార్హం.
నూతన గవర్నర్‌తో ప్రమాణ స్వీకారం చేయించేది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాగా, రాష్ట్రపతి అని తప్పు సమాధానం ఇచ్చారు.
జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ జైలు నుంచి తాత్కాలికంగా నిర్ణీత కాలానికి విడుదల కావడాన్ని బెయిల్ అంటారని సమాధానం చూపించారు. కానీ సరైన సమాధానం ‘పెరోల్’.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

Trending News