MLC Ananthababu: ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన, రాజకీయ దుమారంగా మారిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు మాజీ డ్రైవర్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దారుణంగా కొట్టి చంపాడు. పోలీసుల విచారణలో ఆయన నిజం అంగీకరించాడు. తాను ఒక్కడినే హత్య చేసినట్లు కూడా చెప్పాడు. ఎమ్మెల్సీ హత్య కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ లో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ హత్య చేయడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. అనంతబాబు జైలుకు వెళ్లిన తర్వాత అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో కాకినాడ పోలీసుల తీరుపై మొదటి నుంచి విమర్శలు వచ్చాయి. హత్య జరిగినట్లు పక్కా ఆధారాలు దొరికినా..సుబ్రహ్మణ్యం డెడ్ బాడీని తన కారులో తీసుకొచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబును నాలుగు రోజుల వరకు పోలీసులు పట్టుకోలేదు. దీంతో ఎమ్మెల్సీని పోలీసులు కాపాడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. దళిత సంఘాలు, విపక్షాల ఆందోళనలతో ఎమ్మెల్సీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సందర్బంగా మీడియాకు కేసు వివరాలు వెల్లడించిన కాకినాడ జిల్లా ఎస్పీ వివరణ కూడా వివాదాస్పదమైంది. హంతకుడైన అనంతబాబును ఎస్పీ గారు అని పదేపదే సంబోదించడం, కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మద్యం తాగాడని చెప్పడంపై విమర్శలు వచ్చాయి. కేసు నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు ఈజీగా బయటపడేలా పోలీసుల తీరు ఉందని దళిత సంఘాలు ఆరోపించారు. తాజాగా ఎమ్మెల్సీకి అనుకూలంగా ఉండేలా పరిణామాలు చోటు చేసుకున్నాయి.
అనంతబాబు చంపేసిన ఆయన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. సుబ్రమణ్యం భార్య అపర్ణకు ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎం. విక్టర్ ప్రసాద్ జాబ్ అపాయింట్ మెంట్ లెటర్ ఇచ్చారు. కాకినాడ జిల్లా జి.మామిడాలలో హతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన విక్టర్ ప్రసాద్.. ఆమెకు ఆరోగ్యశాఖలో ఉద్యోగినిగా నియామక పత్రం అందించారు. అంతేకాదు సుబ్రహ్మణ్యం సోదరుడు నవీన్ కు కాంటాక్ట్ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. మామిడాడలోని జగనన్న కాలనీలో సుబ్రహ్మణ్యం భార్య, తల్లికి తలా 150 గజాల ఇంటి స్థలం కేటాయిస్తూ పట్టాలు పంపిణి చేశారు. ప్రభుత్వమే ఇళ్లు కట్టిస్తుందని కూడా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ చెప్పారు. హతుడి కుటుంబానికి జగన్ సర్కార్ ఇప్పటికే 8.25 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. తాజా పరిణమాలతో బాధిత కుటుంబాన్ని వైసీపీ నేతలు ట్రాప్ చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఆగమేఘాల మీద ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం, ఇంటి స్థలం కేటాయించడం అందులో భాగంగానే జరిగిందని అంటున్నారు. సీఎం జగన్ కు ఎమ్మెల్సీ అనంతబాబు అత్యంత సన్నిహితుడనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వేగంగా స్పందిస్తుందనే చర్చ సాగుతోంది.
READ ALSO:Tax Increase: ఇదేం బాదుడయా సీఎం! గుట్టుచప్పుడుకాకుండా ట్రాన్స్ పోర్ట్ ట్యాక్స్ హైక్
READ ALSO: Osmania University: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఓయూ.. ఆరుగురు అరెస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook