Courses After Intermediate 2024: ఇంటర్ పాసైనవారికి సరైన విద్య, ఉపాధి మార్గాలు ఏముంటాయి?

Courses After Intermediate 2024: నేడు ఏపీ ఇంటర్‌ ఫలితాలు రానున్నాయి. త్వరలో తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్‌ పాసైన విద్యార్థులు ఆ తర్వాత ఏ కోర్సులు చేయాలి?

Written by - Renuka Godugu | Last Updated : Apr 12, 2024, 11:09 AM IST
Courses After Intermediate 2024: ఇంటర్ పాసైనవారికి సరైన విద్య, ఉపాధి మార్గాలు ఏముంటాయి?

Courses After Intermediate 2024: నేడు ఏపీ ఇంటర్‌ ఫలితాలు రానున్నాయి. త్వరలో తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్‌ పాసైన విద్యార్థులు ఆ తర్వాత ఏ కోర్సులు చేయాలి? ఏటువైపు వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆలోచిస్తుంటారు. ఇంటర్ తర్వాత ఏ కోర్సులు ఉంటాయో తెలుసుకుందాం.

ఇంజినీరింగ్‌..
పది పాసైన వారికి ప్రథమ ఎంపిక ఇది. దీంతో భవిష్యత్తులో ఇంజినీరింగ్‌ పట్టా పొందవచ్చు. ఇంటర్మీడియేట్‌ ఎంపీసీలో చేరిన వారికి మరిన్ని ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి.  అయితే, ఇంటర్‌ ఎంపీసీ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. లేదా పై చదువులకు కూడా వెళ్లొచ్చు. ఎంపీసీ ద్వారా ఐఐటీ, నీట్‌, ట్రిపుల్ ఐటీలు కూడా పూర్తీ చేస్తే మంచి యూనివర్శిటీల్లో డిగ్రీ సీట్లు పొందవచ్చు. లేదా ఎంపీసీ ఎక్కువ శాతం మంది ఎంసెట్‌ రాస్తారు. వీళ్లు మన రాష్ట్రంలోని వివిధ కాలేజీల్లో ఇంజినీరింగ్ కళాశాలల్లో సీటు పొందవచ్చు. అయితే, ఎంపీసీ ఇంటర్ తో నేవీ, ఎయిర్ ఫోర్స్‌ ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఉంటాయి. వాటి ద్వారా కూడా ఇంటర్ పూర్తయిన వెంటనే జాబ్‌ సంపాదించవచ్చు.

వైద్యవిభాగం..
ఇంటర్ బైపీసీ పూర్తి చేసినవారికి ఇది మరో మంచి భవితవ్యం ఉన్న మార్గం. సాధారణంగా ఇంటర్ బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులకు బీడీఎస్, బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, అగ్రికల్చర్, ఫిజియోథెరపీ, ఫార్మసీ, బయోటెక్నాలజీ వంటి కోర్సులు కూడా అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ఇంటర్ ఎంసెట్‌ తో ఎంబీబీఎస్‌ లో కూడా సీటు సంపాదించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఈ విభాగంలో సీట్లు తక్కువ ఉంటాయి. కాబట్టి గట్టి పోటీ కూడా ఉంటుంది. అయితే ఇతర రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. వాటిలో ఉత్తీర్ణత సాధిస్తే ఢిల్లీ, బెనారస్‌, హిందూ యూనివర్శిటీల్లో కూడా మెడికల్ సీటు పొందవచ్చు.

ఇదీ చదవండి:  హైపర్‌ ఆది సంచలనం.. పవన్‌ కల్యాణ్‌ కోసం షోలకు గుడ్‌ బై

సాధారణ డిగ్రీ..
కొంతమంది విద్యార్థులు ఇంజినీరింగ్‌ ఫీజులు చెల్లించలేని పరిస్థితులు ఉంటాయి. నాన్‌ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా సాధారణ డిగ్రీ పూర్తి చేస్తారు. ఇందులో రకరకాల గ్రూపులు ఉంటాయి. బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీఏ ఇందులో కూడా గ్రూపులు ఉంటాయి. కంప్యూటర్ సైన్స్, ఫైన్ ఆర్ట్స్‌, హాస్పిటాలిటీ అండే మేనేజ్మెంట్‌ కోర్సులు ఉంటాయి. నాన్ మ్యాథ్స్‌ విద్యార్థులతోపాటు ఇంజినీరింగ్‌ వైపు వెళ్లలేని విద్యార్థులకు ఇవి బెస్ట్‌ ఆప్షన్స్.

ప్రొఫెషనల్ కోర్సులు..
ఇంటర్ పూర్తి చేసిన వారికి ఇవి కాకుండా కొన్ని ప్రొఫెషనల్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా కూడా మీరు విదేశాల్లో సైతం ఉద్యోగాలు పొందవచ్చు. అవే ఫ్యాషన్ డిజైనింగ, హోటల్‌ మేనేజ్‌మెంట్, జెమ్మాలజీ, ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ థెరపీ, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చర్, ఫారెస్ట్రీ అండ్ వైల్డ్ లైఫ్, ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్ వంటి కోర్సుల్లో కూడా చేరవచ్చు.

ఇదీ చదవండి: ఏపీ ఇంటర్‌ ఫలితాలపై బిగ్‌ అప్‌డేట్.. రేపే ఫలితాలు

పారామెడికల్ కోర్సులు..
ఇంటర్మీడియేట్‌ పూర్తి చేసినవారు ఇంజినీరింగ్ చేయాలంటే నాలుగేళ్లు పడుతుంది. వైద్య విభాగంలో అయితే ఇంకా ఎక్కువే పడుతుంది. తక్కువ సమయంలో కోర్సులు పూర్తి చేసే అవకాశం కూడా ఉంది. ఆ కోర్సుల్లో చేరితే అతి తక్కువ సమయంలోనే జాబ్‌ కూడా పొందవచ్చు. అదే పారామెడికల్. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, డయాలసిస్,ఈసీజీ , అనెస్తేషియా,  ఎంపీహెచ్‌పీపీ, కార్డియాలజీ టెక్నీషియన్, మెడికల్ ఇమేజింగ్, థియేటర్ టెక్నీషియన్ వంటి కోర్సుల ద్వారా కూడా ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News