AP ICET 2021, AP ECET 2021 results declared: అమరావతి: ఏపీ ఐసెట్, ఏపీ ఇసెట్ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కొద్దిసేపటి క్రితం మంగళగిరిలోని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ ఫలితాలు విడుదల చేశారు. ఏపీ ఐసెట్ ఫలితాల్లో 34,789 మంది విద్యార్థులు అర్హత సాధించగా, ఏపీ ఈసెట్ ఫలితాల్లో 29,904 మంది అభ్యర్థులు అర్హత సాధించారని ఏపీ విద్యా శాఖ వెల్లడించింది.
ఏపీ ఐసెట్ 2021, ఏపీ ఈసెట్ 2021 పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ sche.ap.gov.in లో తమ అడ్మిట్ కార్డ్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవడం ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవడంతో పాటు ర్యాంక్ కార్డులు (AP ICET 2021 rank cards) కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ సెప్టెంబర్ 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ఐసెట్ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే ఇంజనీరింగ్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ అడ్మిషన్స్ కోసం నిర్వహించే ఏపీ ఈసెట్ (ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్షలను అనంతపురం జేఎన్టీయూ (JNTU Ananthapur) నిర్వహించింది. ఫలితాల వెల్లడి కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్ (AP Minister Adimulapu Suresh), ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ కే హేమ చంద్రా రెడ్డి పాల్గొన్నారు.
Also read: AP Government: ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా నోరి దత్రాత్రేయుడు
ఏపీలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 13 కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈసెట్ పరీక్షల్లో (AP ECET exams 2021) మొత్తం 32,318 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 48 టెస్ట్ సెంటర్స్‌లో ఈసెట్ పరీక్షలు నిర్వహించారు.
Also read : CJI NV Ramana: టీటీడీలో ఏదైనా తప్పు చేస్తే దేవుడు ఊరుకోడు - సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook