MANSAS TRUST: మాన్సాస్ ట్రస్టు కేసులో హైకోర్టు కీలక తీర్పు, ఛైర్మన్‌గా తిరిగి అశోక్ గజపతిరాజు

MANSAS TRUST: రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన మాన్సాస్ ట్రస్ట్ కేసులో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల్ని కొట్టివేసింది. సంచయిత గజపతిరాజును ఛైర్ పర్సన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులున్నాయి.

Last Updated : Jun 14, 2021, 05:35 PM IST
  • మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ నియామక కేసులో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
  • సంచయిత గజపతిరాజు నియామక ఉత్తర్వులు జీవో నెంబర్ 72ను కొట్టివేసి హైకోర్టు
  • రెండు ట్రస్ట్‌లకు ఛైర్మన్లుగా తిరిగి అశోక్ గజపతిరాజునే నియమించాలని ఆదేశం
MANSAS TRUST: మాన్సాస్ ట్రస్టు కేసులో హైకోర్టు కీలక తీర్పు, ఛైర్మన్‌గా తిరిగి అశోక్ గజపతిరాజు

MANSAS TRUST: రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన మాన్సాస్ ట్రస్ట్ కేసులో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల్ని కొట్టివేసింది. సంచయిత గజపతిరాజును ఛైర్ పర్సన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులున్నాయి.

మాన్సాస్, సింహాచలం ట్రస్టు కేసులో ఏపీ హైకోర్టు(AP High Court) తీర్పు వెలువరించింది. ట్రస్టు చైర్ పర్సన్  నియామక జీవోను హైకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2020 మార్చ్‌లో సింహాచలం దేవస్థానం ( Simhachalam Devasthanam Trust Board) పాలక మండలి ఛైర్మన్‌గా ఆనంద గజపతిరాజు రెండవ కుమార్తె సంచయిత గజపతిరాజును నియమిస్తు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం విజయనగరం రాజుల ఆధీనంలో ఉన్న మాన్సాస్ ట్రస్టు (Mansas Trust) బోర్డు ఛైర్మన్‌గా కూడా ఆమెనే నియమించింది. రొటేషన్ పద్ధతిలో సంచయితకు అవకాశమిచ్చినట్టు ప్రభుత్వం జీవోలో పేర్కొంది. 

అయితే వంశపారంపర్యంగా వస్తున్న ట్రస్టులో వయస్సులో పెద్దవారు ట్రస్టీగా ఉండాలని..ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా ట్రస్టుల ఛైర్మన్ నియామకం చేపట్టిందని అశోక్ గజపతిరాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నిబంధనల ప్రకారమే నియామకం చేపట్టినట్టు ప్రభుత్వం (Ap Government) వాదించింది. ఇరుపక్షాల వాదనను విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ ఆ కేసులో కీలకమైన తీర్పు వెలువరించింది. మాన్సాస్ ట్రస్టు, సింహాచలం ట్రస్టు ఛైర్మన్‌లుగా సంచయిత గజపతిరాజు(Sanchayita Gajapathi raju) నియామక ఉత్తర్వుల్ని హైకోర్టు కొట్టివేసింది. ఆ రెండు పోస్టుల్లో తిరిగి అశోక్ గజపతిరాజును నియమించాలని ఆదేశించింది. 1958లో పూసపాటి వంశీయులైన దివంగత పీవీజీ రాజు... మహరాజ అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్ ట్రస్టును స్థాపించారు. 2016లో ఆనంద్ గజపతి రాజు మరణానంతరం పీవీజీ రాజు రెండవ కుమారుడైన అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi raju) మాన్సాస్ ఛైర్మన్ పదవిని చేపట్టారు. 2020 మార్చ్‌లో జీవో నెంబర్ 72 ద్వారా ప్రభుత్వం అశోక్ గజపతిరాజును తొలగించి..ఆనంద గజపతిరాజు రెండవ కుమార్తె సంచయిత గజపతి రాజును నియమించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించడంతో..ఇవాళ ఆ తీర్పు వెలువడింది.

Also read: AP Corona Update: ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా ఉధృతి, 24 గంటల్లో దాదాపు 6 వేల కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News