Ayyanna Patrudu: అయ్యన్నపాత్రుడికి ఊరట.. ఇంటి గోడ కూల్చివేతపై 'స్టే' ఇచ్చిన హైకోర్టు...

HC Relief for Ayyanna Patrudu :  ఏపీలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కబ్జా ఆరోపణలు, ఆయన ఇంటి గోడ కూల్చివేత హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో తాజాగా హైకోర్టు స్టే విధించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 20, 2022, 08:29 AM IST
  • అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చివేతపై వివాదం
  • కబ్జా చేశారంటూ కూల్చివేసిన మున్సిపల్ అధికారులు
  • హైకోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చిన న్యాయస్థానం
Ayyanna Patrudu: అయ్యన్నపాత్రుడికి ఊరట.. ఇంటి గోడ కూల్చివేతపై 'స్టే' ఇచ్చిన హైకోర్టు...

HC Relief for Ayyanna Patrudu : మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. కబ్జా ఆరోపణలతో మున్సిపల్ అధికారులు చేపట్టిన అయ్యన్న ఇంటి ప్రహారీ గోడ కూల్చివేత ప్రక్రియపై హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలిచ్చేంతవరకూ ఈ విషయంలో ముందుకు వెళ్లవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణం ఈ విషయాన్ని మున్సిపల్ అధికారులకు తెలియజేయాలని హైకోర్టు జడ్జి జస్టిస్ డి.రమేశ్ ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించారు. 

అర్ధరాత్రి సమయంలో అయ్యన్న ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత వివాదాస్పదంగా మారింది. కూల్చివేతను అయ్యన్న కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కుటుంబ సభ్యులను అక్కడినుంచి తరలించారు. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడి కుమారులు విజయ్, రమేష్ ఆదివారం (జూన్ 19) హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మున్సిపాలిటీ ఆమోదం ప్రకారమే అయ్యన్న ఇంటి నిర్మాణం జరిగిందని హైకోర్టుకు వివరించారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపించారు. 

పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలపై జడ్జి సతీశ్ స్పందిస్తూ అర్ధరాత్రి కూల్చివేతలు చేపట్టడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు చేపట్టవద్దని న్యాయస్థానం మార్గదర్శకాలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కబ్జా ఆరోపణలు, గోడ కూల్చివేతపై పూర్తి వివరాలు సమర్పించాలని కోరారు. ఇందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరడంతో విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకూ కూల్చివేత ప్రక్రియ నిలిపివేయాలని ఆదేశాలిచ్చారు. 

కాగా, అయ్యన్నపాత్రుడు తన ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వ భూమిలో రెండు సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారని మున్సిపల్ అదికారులు ఆరోపిస్తున్నారు. దీనిపై నోటీసులు ఇచ్చినా ఆయన నుంచి స్పందన లేదని చెబుతున్నారు. అయ్యన్న స్పందించకపోవడంతోనే ప్రహరీ గోడ కూల్చివేత చేపట్టినట్లు వెల్లడించారు. మరోవైపు, ఇది బీసీలపై దాడుల్లో భాగమేనని టీడీపీ ఆరోపిస్తోంది. అయ్యన్న ఇంటిపై దాడులను నిరసిస్తూ సోమవారం (జూన్ 20) ఛలో నర్సీపట్నంకు పిలుపునిచ్చింది. 

Also Read: Pawan Kalyan: పొత్తులపై పవన్ కల్యాణ్ యూ టర్న్! టీడీపీలో పరేషాన్.. అంతా ఆయనవల్లేనా?

Also Read: Horoscope Today June 20th: నేటి రాశి ఫలాలు.. ప్రేమ వ్యవహారంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News