Guntur bjp leader vanama Narendra romance video: ఇటీవల కాలంలో ఆంధ్ర ప్రదేశ్ లో కొంత మంది రాజకీయ నాయకులు నీచంగా ప్రవర్తిస్తున్నారు. పార్టీకి చెందని మహిళ నేతలతో రొమాన్స్ చేస్తు అడ్డంగా దొరికిపొతున్నారు. గతంలో వైఎస్సార్సీపీకి చెందిన పలువురు నేతలు రొమాంటికి వీడియోలతో అడ్డంగా దొరికి పోయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. కొన్నిరోజుల క్రితం ఆదిమూలం రొమాన్స్ వీడియో ఘటన ఏపీలో పెనుదుమారంగా మారిన విషయం తెలిసిందే.
Guntur district BJP Incharge/President! 😱👀 #OutOfContextTeluguPolitics pic.twitter.com/MwZvzsWJX3
— Out Of Context Telugu Politics (@oocTelPolitics) October 9, 2024
ఆ ఘటనలో ఏపీ టీడీపీ ఆయనను పార్టీలో నుంచి సస్పెండ్ కూడా చేసింది. తొలుత బాధితురాలు ఆదిమూలంపైన తీవ్ర ఆరోపణలు చేసింది. కానీ చివరకు కోర్టులో కేసు వాపసు తీసుకుని అందర్నిషాకింగ్ కు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో మరో రాజకీయ నేత రాసలీలలు ఇప్పుడు వార్తలలో నిలిచాయి.
పూర్తి వివరాలు..
గుంటూరు జిల్లాలో బీజేపీ నేత వనమా నరేంద్ర మహిళతో అసభ్యంగా మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయారు. అంతే కాకుండా.. తనతో కలిసి మందు కొట్టాలని, ఇద్దరం కలసి ఎంజాయ్ చేద్దామంటూ కూడా మాట్లాడారు. ఆయనకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు బీజేపీ నేత వీడియోలో మాట్లాడుతూ..
‘రేపు నాతో వస్తావా’ అంటూ చేసిన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరం కలిసి.. రేపు మందు కొడదాం.. పోయినసారి లాగే ఎంజాయ్ చేద్దామంటూ అసభ్యకంగా మాట్లాడారు.‘ ఇప్పుడు కట్టుకొన్న పూలచీరలోనే రా’ అంటూ ఆమెను సదరు నేత కోరడం ఆ వీడియో కాల్‌లో కన్పించింది.
'రేపు ఏడు గంటల కల్లా వచ్చేయ్.ఇద్దరం కలిసి మందు కొడదామన్నారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు, పార్టీ నాయకులు మాత్రం షాకింగ్ కు గురౌతున్నారు. ఇదిలా ఉండగా.. దీనిపై బీజేపీ హైకమాండ్ మాత్రం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై బీజేపీ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపైన ఏపీ బీజేపీ ఇప్పటికే అంతర్గత విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
Read more: Obscene Videos: కేబుల్ టీవీలో అశ్లీల వీడియోలు.. దిగ్భ్రాంతికి లోనయిన కుటుంబసభ్యులు
అయితే.. కొంత మంది మాత్రం.. సదరు నేతను కావాలనే ఇరికించారని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ నేత ఒక మహిళతో ఫోన్‌లో మాట్లాడిన ఆడియో వైరల్ గా మారింది. ఆ మహిళే ఇప్పుడు బీజేపీ నేతతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఆమె ఒక పార్టీలో ఉండగా.. ఆ తర్వాత ఇప్పుడు ఆమె బీజేపీలో చేరినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి