ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల (AP Group-1 Mains Exam) షెడ్యూలు ఖరారైంది. డిసెంబర్ 14 నుంచి 20 వరకు ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వెల్లడించింది. కాగా, నవంబర్ 2 నుంచి 13 వరకు జరగాల్సిన ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ ఇటీవల వాయిదా వేయడం తెలిసిందే.
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను డిసెంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ రీషెడ్యూల్ చేసింది. ఏపీలోని అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కమిషన్ సభ్యులు తెలిపారు. అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ నుంచి హాట్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. పరీక్షలు వాయిదా వేయాలన్న అభ్యర్థుల అభ్యర్థననుఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తోసిపుచ్చింది. దీంతో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు అడ్డంకులు దాదాపుగా తొలగిపోయాయి. ఏపీపీఎస్సీ (APPSC) అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచింది.
Also Read : ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 169 గ్రూప్ 1 పోస్టులకు గతేడాది స్క్రీనింగ్ టెస్ట్‌ను ఏపీపీఎస్సీ నిర్వహించడం తెలిసిందే. తొలి కీ తర్వాత మెయిన్స్ పరీక్షకు 1:50 ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసింది. కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో మెయిన్స్ పరీక్షలు కొన్ని రోజులు వాయిదా పడ్డాయి. తాజా నిర్ణయంతో ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. SBI PO Recruitment 2020: ఎస్‌బీఐలో భారీగా పీఓ పోస్టులకు నోటిఫికేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe