అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. కరోనా వైరస్ భయాల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఏపీలోనూ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం చూపినా వయసు మళ్లిన వారికి ఒకటో తారీఖునే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. ఒకటో తారికునే ఠంచన్‌గా పింఛన్ అంటూ ఇంటింటికి వెళ్లి గ్రామ, వార్డు వాలంటీర్లు వృద్ధులకు పింఛన్లు అందిస్తుండటం విశేషం. మిస్ బికినీ ఇండియా విన్నర్ ఫొటో గ్యాలరీ
ఏప్రిల్‌లో బ్యాంక్ సెలవులు ఇవే..
1వ తారీకునే ఠంచన్ గా పింఛన్. ఇంటింటికీ వెళ్లి పింఛన్లను డోర్ డెలివరీ చేస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బయోమెట్రిక్ విధానం మినహాయింపు. లాక్ డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల్లో ఉండిపోయినప్పటికీ పింఛన్ తీసుకునేలా వెసులుబాటు.#PensionsDoorDelivery #APvolunteers pic.twitter.com/pCk1NQ6yt8
— YSR Congress Party (@YSRCParty) April 1, 2020
అయితే కరోనా భయాల నేపథ్యంలో బయోమెట్రిక్ విధానానికి తాత్కాలికంగా మినహాయింపు ఇచ్చారు. గ్రామ, వార్డు వాలంటీర్లు పెన్షనర్ల నుంచి బయోమెట్రిక్ తీసుకోకుండా, వారికి ఫించన్ అందజేస్తున్నారు. మరోవైపు లాక్‌డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల నుంచి సొంతూరుకు చేరుకోలేని వారికి సైతం పింఛన్ తీసుకునే వెసలుబాటును వైఎస్ జగన్ సర్కార్ కల్పించింది. కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్
కరోనా నేపథ్యంలో ఒకటో తారీఖున ఇంటివద్దకే వచ్చి పింఛన్లు ఇస్తున్నారు కానీ, జీతాలు మాత్రం ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు త్వరితగతిన పెరిగిపోతుండటం ప్రభుత్వాన్ని, అధికారులను ఆయోమయానికి గురి చేస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ