AP Grama Sachivalayam 2020 Results: ఏపీ గ్రామ, వార్డు సచివాలయం ఫలితాలు కోసం క్లిక్ చేయండి

AP Grama Sachivalayam Result 2020: ఏపీ గ్రామ సచివాలయం ఫలితాలు విడుదల. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఈ ఫలితాలను మంగళవారం స్వయంగా విడుదల చేశారు.  రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి AP Ward Sachivalayam 2020 Results

Last Updated : Oct 27, 2020, 10:57 PM IST
AP Grama Sachivalayam 2020 Results: ఏపీ గ్రామ, వార్డు సచివాలయం ఫలితాలు కోసం క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షా ఫలితాలు (AP Grama Sachivalayam 2020 Results) విడుదలయ్యాయి, ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ పరీక్షలు 2020 ఫలితాలను మంగళవారం స్వయంగా విడుదల చేశారు. ఏపీలోని 13 శాఖల్లో మిగిలిపోయిన 16,208 పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 20 నుంచి 26 తేదీ వరకు ఏపీ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు నిర్వహించడం తెలిసిందే.

 

AP Ward Sachivalayam 2020 Results | 16,208 పోస్టులకు గానూ మొత్తం 7,68,965 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. అయితే సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పరీక్ష జరిగిన మరుసటి రోజు నుంచే సెస్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 27 వరకు అత్యంత వేగంగా ఓఎంఆర్‌లను స్కాన్ చేశారు. ఈ క్రమంలో పూర్తి ప్రక్రియ ముగిసిన అనంతరం అక్టోబర్ 27న సీఎం వైఎస్ జగన్ ఏపీ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు ఫలితాలు (AP Grama Sachivalayam Result 2020) విడుదల చేశారు. 

 

ఈ ర్యాంకుల ఆధారంగానే ప్రభుత్వం నియామకాలు చేపడుతుంది. వీటిలో జిల్లాల వారిగా రిజర్వేషన్ నియామకాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం16,208 పోస్టులను 19 కేటగిరిల్లో ప్రకటించింది. ఇప్పటివరకు మొత్తం 11,162 గ్రామ సచివాలయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1,26.728 పోస్టుల్లో 1,10,520 పోస్టులను భర్తీ చేసింది. 

ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయితీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులు హాజరయ్యారు.  Also Read : SBI Clerk Mains Hall Ticket 2020: ఎస్‌బీఐ ‘క్లర్క్’ మెయిన్స్ హాల్‌ టికెట్లు విడుదల

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News